మహా ఉద్యోగులకు దీపావళి బోనస్ ప్రకటన
Diwali bonus announcement for Maha employees
ముంబాయి: మహారాష్ట్ర ఎన్డీయే ప్రభుత్వం ఉద్యోగులకు తీపి కబురందించింది. మంగళవారం మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే మీడియా సమావేశం నిర్వహించారు. దీపావళి బోనస్ ను ప్రకటించారు. దీంతో బృహన్ ముంబాయి మున్సిపల్ కార్పొరేషన్ 40వేల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. బోనస్ గా కింది స్థాయి ఉద్యోగులకు రూ. 29వేలు లభించనున్నాయి. టీచర్లు, ఆశావర్కర్లు, సోషల్ హెల్త్ వాలంటీర్లు, హెల్పర్లకు కూడా బోనస్ లభించనుంది. గతేడాది దీపావళికి కూడా ఏక్ నాథ్ షిండే ప్రభుత్వం రూ. 26వేల బోనస్ కు ప్రకటించింది గతం కంటే ఈసారి రూ. 3వేలు ఎక్కువగా బోనస్ ను ప్రకటించడంలో ఉద్యోగుల్లో ఆనందం వ్యక్తం అవుతుంది. అయితే బోనస్ ప్రకటించిన కొద్దిసేపటికే కేంద్ర ఎన్నికల కమిషన్ ఎన్నికల తేదీలను ప్రకటించింది.