ఆకస్మిక వర్షాలు,తుపాను పశ్చిమ బెంగాల్​ లో 13 మంది మృతి

13 people died in West Bengal due to sudden rains and storm

May 17, 2024 - 17:24
 0
ఆకస్మిక వర్షాలు,తుపాను పశ్చిమ బెంగాల్​ లో 13 మంది మృతి

కోల్​ కతా: పశ్చిమ బెంగాల్​ లో ఆకస్మిక వర్షాలు, తుపాను కారణంగా 13 మంది మరణించారు. వీరిలో ముగ్గురు చిన్నారులున్నారని అధికారులు శుక్రవారం మీడియాకు వివరించారు. తుపాను, ఆకస్మిక వర్షాలు గురువారం సాయంత్రం నుంచి అర్థరాత్రి వరకు కురిసాయని తెలిపారు. మాల్దాలో 11 మంది, ముర్షీదాబాద్​ లో ఒక్కరు, జల్పాయి గురిలో ఒక్కరు మరణించారని పోలీసులు తెలిపారు.

మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల నష్టపరిహారం, అంత్యక్రియలకు రూ. 2వేలను అందజేస్తామని తెలిపారు. 

వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ..

ఆకస్మిక వర్షాలు, తుపానుపై వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాజస్థాన్, పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, గుజరాత్, మహారాష్ట్ర, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, ఒడిశాలో హీట్ వేవ్ అలర్ట్ ఉండగా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర సహా 24 రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.