కేజ్రీ నీతిమంతుడా?

మద్యం కేసులో బెయిల్​ పై వచ్చాడు నీతిసూక్తులు వ్లలించడం దురదృష్టకరం పదేళ్లైనా రాజ్యాంగాన్ని మార్చలే మభ్యపెట్టి ఓట్లు దండుకునేందుకు హస్తం ప్లాన్​ సుస్థిరం, సురక్షితమే తమ లక్ష్యం కేజ్రీకి లభించని క్లీన్​ చీట్​ దేశాన్ని ఎవరు విభజించారు? త్వరలో సాయుధ దళాల చట్టం తొలగింపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​ షా

May 17, 2024 - 17:02
 0
కేజ్రీ నీతిమంతుడా?

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: అరవింద్​ కేజ్రీవాల్​ ఎక్కడికి వెళ్లినా లిక్కర్​ స్కామ్​ నే ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని ఆయనేమో నీతి మంతున్ని తానే అని ప్రకటించుకుంటున్నారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​ షా అన్నారు. శుక్రవారం అమిత్​ షా మీడియాతో మాట్లాడారు. మద్యం కుంభకోణంలో జైలుకు వెళ్లి బెయిల్​ పై బయటికి వచ్చిన నేరస్థులు కూడా తమకు నీతిసూక్తులు చెప్పే రోజు రావడం దురదృష్టకరమన్నారు.

పదేళ్లపాటు తమకు రాజ్యాంగం మార్చే అవకాశం ఉన్నా తామెందుకు రాజ్యాంగాన్ని మార్చలేదని ప్రశ్నించారు. బీజేపీకి, మోదీకి రాజ్యాంగమన్న, అంబేద్కర్​ అన్న అత్యంత గౌరవం అన్న విషయం మరిచిపోరాదన్నారు. కేవలం మోదీకే కాదని దేశ ప్రజలందరికి రాజ్యాంగం, బాబా సాహేబ్​ అంబేద్కర్​ అంతే గొప్పవారని తెలిపారు. ఈ విషయంలో మభ్యపెట్టి ఓట్లు దండుకోవాలనే కుట్రకు కాంగ్రెస్​ తెరతీసిందని అమిత్​ షా మండిపడ్డారు. 

రాజకీయాల్లో సుస్థిరత, సరిహద్దులు భద్రంగా ఉండాలన్నా బీజేపీ ప్రభుత్వం ఉంటేనే అది సాధ్యమని అమిత్​ షా పేర్కొన్నారు.

ఆర్టికల్​ 370 రద్దు, ట్రిపుల్​ తలాక్​ రద్దు, రామ మందిర నిర్మాణం, యూసీసీ పౌరసత్వం లాంటి అనేక నిర్ణయాలను తీసుకున్నామన్నారు. తద్వారా దేశ ప్రజలు సురక్షితంగా ఉండేలా తాము ప్రయత్నించామని షా తెలిపారు. 

ఇంతపెద్ద ప్రజాస్వామ్య దేశ మనుగడ సాధించాలంటే ప్లాన్​ ఎ ఉండగానే ప్లాన్​ బీని రూపొందించాల్సిన అవసరం ఉంటుందని తెలిపారు. ఈ మాత్రం తెలియని వారు దేశాన్ని పరిపాలించి విచ్ఛిన్నానికి కారకులయ్యారని షా మండిపడ్డారు.

కేజ్రీవాల్​ కు కోర్టు నుంచి వచ్చింది క్లీన్​ చిట్​ కాదనే విషయాన్ని అందరూ తెలుసుకోవాలన్నారు. కాంగ్రెస్​ నేతృత్వంలోని కూటమిపార్టీలన్నీ అవినీతిలో కూరుకుపోయాయని అమిత్​ షా స్పష్టం చేశారు.

కాంగ్రెస్​ పార్టీ నాయకులు ఎప్పుడు దేశ విభజన కోసమే మాట్లాడతారని ఆరోపించారు. ఉత్తర భారతం, దక్షిణ భారతాలను విభజిస్తున్నారని ఆరోపిస్తున్నట్లు పేర్కొన్నారు. ఒక్కటి ప్రతీఒక్కరూ గుర్తెరగాలన్నారు. బీజేపీ అవసరం అయితే మన ప్రాంతాలను తిరిగి తీసుకువస్తుందని అంతేగాని దేశ విభజనకు ఎన్నటికీ రాజీ పడబోదన్నారు. అసలు ఏ పార్టీ, ఏ ప్రధాని నేతృత్వంలో భారతదేశ విభజన జరిగిందో ప్రజలు చెప్పాలన్నారు. 
జమ్మూకశ్మీర్​ నుంచి సాయుధ దళాల చట్టాన్ని తొలగించే విషయాన్ని కేంద్రం పరిశీలిస్తోందన్నవారు. సైనికులను వెనక్కి రప్పించేందుకు సన్నద్ధంగా ఉన్నామన్నారు. సెప్టెంబర్​ లోపు జమ్మూకశ్మీర్​ లో లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనలో కూడా ఉన్నట్లు అమిత్‌ షా స్పష్టం చేశారు.