భవిష్యత్తు కోసం ఓటు తిరువనంతపురం ఎన్డీయే అభ్యర్థి రాజీవ్ చంద్రశేఖర్
Vote for the future Rajeev Chandrasekhar

తిరువనంతపురం: తిరువనంతపురం భవిష్యత్తు కోసం ఓటర్లంతా స్వచ్ఛందంగా బయటికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎన్డీయే అభ్యర్థి కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. శుక్రవారం చంద్రశేఖర్ తిరువనంతపురంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. 15–20 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఆశించిన మేర అభివృద్ధి జరగలేదన్నారు. బీజేపీ హాయంలో పెద్ద యెత్తున కేరళ అభివృద్ధికి, తమ ప్రాంత అభివృద్ధికి ఆస్కారం ఉందన్నారు. స్థానిక ప్రభుత్వం అసమర్థత వల్ల అభివృద్ధి వెనుకబడిందని రాజీవ్ చంద్రశేఖర్ ఆరోపించారు. తిరువనంతపురం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న చంద్రశేఖర్ కు హస్తం అభ్యర్థి శశిథరూర్ రూపంలో పోటీ ఉంది. ఓటు వేసే ముందు చంద్రశేఖర్ వెట్టుకాడ్ చర్చికి వెళ్లి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.