స్వాతిపై దాడి.. నోరు మెదపని హస్తం నేతలు
రాహుల్, కేజ్రీ సభపై కమ్ముకున్న నీలినీడలు
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: స్వాతిమాల్ పై దాడి విషయంలో కాంగ్రెస్ పార్టీ ఆచీతూచీ వ్యవహరిస్తోంది. ప్రియాంక గాంధీ గురువారం ప్రకటన తరువాత ఆమె కూడా స్పష్టమైన నిర్ణయం వెల్లడించలేదు. అండగా ఉంటానని మాత్రమే వెల్లడించింది. మరోవైపు చిన్న విషయాన్ని కూడా రాద్ధాంతం చేసే ఆ పార్టీ నాయకులు సోనియా, రాహుల్, ఖర్గే, అధీర్ రంజన్, జై రామ్ రమేశ్ వంటి వారు కూడా నోరు మెదకపపోవడం విశేషం.
శుక్రవారం విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసిన జై రామ్ రమేశ్ విలేఖరులు స్వాతిమాలివాల్ అంశంపై పలుమార్లు ప్రశ్నించినా నోరు మెదపలేదు. కేవలం వాతావరణం అంశంపై మాట్లాడి సమావేశాన్ని ముగించారు.
కాంగ్రెస్ పార్టీతో ఆప్ పార్టీ జతకట్టడంతోనే ఆ పార్టీ విషయంలో స్పందించేందుకు వెనకడుగు వేస్తున్నారని అన్నారు. ఘటన జరిగి మూడు రోజులు గడుస్తున్నా సీఎం కేజ్రీవాల్, కాంగ్రెస్ బడా నాయకులు స్పందించడం లేదు. మరోవైపు నిందితుడి బిభవ్ తో పాటు లక్నోకు వెళ్లిన కేజ్రీవాల్, అఖిలేష్ లు కూడా ఈ విషయంపై స్పందించకపోవడం విశేషం. స్వాతి మాలివాల్ విషయంపై ప్రశ్నించినప్పటికీ జై రామ్ రమేశ్ వ్యాఖ్యానించేందుకు నిరాకరించారు.
అయితే రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్ లో బహిరంగ సభ నిర్వహణకు ఏర్పాటు చేసే సమయంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఆ సభ జరగడంపై నీలినీడలు కమ్ముకున్నాయి.