భారతీయులకు కష్టం మోదీ గ్యారంటీతో సురక్షితం

ఇరాన్​ స్వాధీనం చేసుకున్న నౌకలోని మహిళ భారత్​ చేరిక ట్వీట్​ ద్వారా వివరాలు వెల్లడించిన విదేశాంగ శాఖ మంత్రి ఎస్​. జై శంకర్​, ప్రతినిధి రణధీర్​ జైస్వాల్​

Apr 18, 2024 - 18:10
 0
భారతీయులకు కష్టం మోదీ గ్యారంటీతో సురక్షితం

న్యూఢిల్లీ. ప్రపంచంలోని ఏ మూలన భారతీయులకు కష్ట, నష్టం వాటిల్లినా మోదీ గ్యారంటీతో వారిని సురక్షితంగా భారత్​ కు తీసుకువస్తామని విదేశాంగ శాఖ మంత్రి ఎస్​. జై శంకర్ అన్నారు. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్​ జైస్వాల్​ ఈ విషయంపై ఎక్స్​ లో ట్వీట్​ చేశారు. గురువారం ఆయన ఎక్స్​ మాధ్యమం ద్వారా ఇటీవల ఇరాన్​ స్వాధీనం చేసుకున్న నౌకలోని ఓ మహిళను సురక్షితంగా భారత్​ కు తీసుకువచ్చిన విషయాన్ని పోస్టుమాధ్యమంగా తెలిపారు. కేరళకు చెందిన ఆన్​ టెస్సా జోసెఫ్​ నౌకలోని డెక్​ క్యాడెట్​ గా ఉన్నారు. ఆ నౌకలో ఉన్న 17 మందిలో ఈమె ఒకరు. ఇరాన్​ తో చర్చల సందర్భంగా జోసెఫ్​ సురక్షితంగా గురువారం కొచ్చి విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ విషయాన్ని రీట్వీట్​ ద్వారా విదేశాంగ శాఖ మంత్రి ఎస్​. జై శంకర్​ పంచుకున్నారు. 

విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ టెహ్రాన్‌లోని భారత మిషన్‌కు ఈ విషయం తెలుసునని, కంటైనర్ షిప్‌లోని మిగిలిన 16 మంది భారతీయ సిబ్బందితో సంప్రదింపులు జరుపుతున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది. సిబ్బంది ఆరోగ్యంగా ఉన్నారని పేర్కొంది.  భారతదేశంలోని వారి కుటుంబ సభ్యులతో కూడా ఫోన్​ ద్వారా మాట్లాడుతున్నారని వివరించింది. మిగిలిన సిబ్బంది త్వరలోనే విడుదలకు సంప్రదింపులు జరుపుతున్నట్లు జై శంకర్​ తెలిపారు. ఈ విషయంపై ఇరాన్ విదేశాంగ మంత్రి అమీర్ అబ్దుల్లాహియాన్‌తో మాట్లాడినట్లు ఆయన స్పష్టం చేశారు.