ఫ్లోర్​ టెస్ట్​లో బీజేపీకి పూర్తి మెజార్టీ

హరియాణా అసెంబ్లీలో బీజేపీ అభ్యర్థి, సీఎం నయాబ్​ సింగ్​కు పూర్తి మెజార్టీ లభించింది.

Mar 13, 2024 - 15:51
 0
ఫ్లోర్​ టెస్ట్​లో బీజేపీకి పూర్తి మెజార్టీ

చండీగఢ్: హరియాణా అసెంబ్లీలో బీజేపీ అభ్యర్థి, సీఎం నయాబ్​ సింగ్​కు పూర్తి మెజార్టీ లభించింది. ఫ్లోర్​ టెస్ట్​(బలనిరూపణ) మూజువాణి ఓటుతో విశ్వాస తీర్మానం ఆమోదించబడింది. మంగళవారం సీఎంగా పదవి ప్రమాణ స్వీకారం చేపట్టిన నయాబ్​ సింగ్​బుధవారం అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకున్నాడు. బీజేపీకి చెందిన 41 మంది, హర్యానా లోఖిత్​ పార్టీ–1, స్వతంత్రులు –ఆరుగురు పూర్తి మద్దతు ప్రకటించారు. వీరే గాక బీజేపీకి మరింత మంది మద్దతు ఉంది.  48 మంది కాకుండా జేజేపీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు కూడా బీజేపీకి పూర్తి మద్దతును ప్రకటించారు.