చత్తీస్​ గఢ్​ లో పేలుడు 10 నుంచి 12 మంది మృతి?

10 to 12 killed in Chattisgarh blast?

May 25, 2024 - 11:02
 0
చత్తీస్​ గఢ్​ లో పేలుడు 10 నుంచి 12 మంది మృతి?

రాయ్​ పూర్​: చత్తీస్​ గఢ్​ లోని బెమెతరాలో గన్​ పౌడర్​ ఫ్యాక్టరీలో భారీ పేలుడు చోటు చేసుకుంది. ఈ పేలుడులో 10 నుంచి 12 మంది గాయపడినట్లు తెలుస్తోంది. కాగా ఏడుగురు గాయాలైన వారిని స్థానికంగా ఉన్న మెకహారా ఆసుపత్రిలో చికిత్సనందింప చేస్తుండగా ఒకరు మృతి చెందారు. ఈ పేలుడు శనివారం ఉదయం ఆరుగంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. పేలుడు ధాటికి ఫ్యాక్టరీ గోడలు, పైకప్పు కూలి కిందపడిపోయాయి. శిథిలాల కింద కార్మికులు చిక్కుకున్నారు. మరోవైపు రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. గాయపడ్డవారిని మెకహారా ఆసుపత్రితోపాటు రాయ్​ పూర్​ లోని ఎయిమ్స్​, సమీప ఆసుపత్రుల్లో చేర్పించారు. కాగా మృతుల సంఖ్యపై ఇంకా స్పష్టంగా వివరాలు వెల్లడికాలేదు. సహాయక చర్యలు వేగంగా కొనసాగుతుండడం వేర్వేరు ఆసుపత్రుల్లో గాయపడ్డవారిని తరలిస్తుండడంతో పూర్తి సమాచారం మధ్యాహ్నం తరువాతే అందజేస్తామని పోలీసులు తెలిపారు. కాగా శిథిలాల కింద చిక్కుకొని చాలామంది కార్మికులు ప్రాణాలు విడిచి ఉండొచ్చని స్థానికులు పేర్కొంటున్నారు. ఫ్యాక్టరీలో 800మందికి పైగా పనిచేస్తున్నారన్నారు.