ప్రముఖుల ఓట్లు–3
Celebrity Votes–3
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఆరోదశ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉదయం నుంచే ప్రముఖులు ఓటేసేందుకు క్యూ కట్టారు.
సంజయ్ జై స్వాల్..
బిహార్ లోని పశ్చిమ చంపారన్ స్థానం నుంచి పోటీలో ఉన్న బీజేపీ అభ్యర్థి సంజయ్ జై స్వాల్ ఓటు వేశారు. అనంతరం ఆయన మీడియాతో మట్లాడారు. కేంద్రంలోని ప్రభుత్వం నిరుపేదల సంక్షేమమే కాంక్షిస్తుందన్నారు. 400 దాటుతామని జై స్వాల్ ధీమా వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రతీ ఒక్కరూ ఓటు వేయాలని పిలుపునిచ్చారు.
ఆటోలో బీజేడీ నేత వీకే పాండియన్..
ప్రజాస్వామ్యంలో పండుగరోజన్నారు. ప్రతీ ఒక్కరూ తప్పకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని బీజేడీ నాయకుడు వీ.కె. పాండియన్ విజ్ఞప్తి చేశారు. భువనేశ్వర్ లోని పోలింగ్ బూత్ కు ఆటోలో వచ్చిన ఆయన తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. తనను ఓటరు కేంద్రానికి చేర్చినందుకు ఆటో అసోసియేషన్ కు ధన్యవాదాలు తెలిపారు. వారి కోరిక మేరకు ఆటోలో వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు.
జమ్మూకశ్మీర్ బీజేపీ అధ్యక్షుడు రవీందర్ రైనా..
ఓటింగ్ సందర్భంగా జమ్మూకశ్మీర్ లో ఉత్సాహపూరిత వాతావరణం నెలకొందని బీజేపీ జమ్మూకశ్మీర్ అధ్యక్షుడు రవీందర్ రైనా తెలిపారు. శనివారం ఉదయం రాజౌరిలో రైనా ఓటు వేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. లోక్ సభ ఎన్నికలు భారత ప్రజాస్వామ్యానికి పండుగ లాంటివన్నారు. ఉదయం నుంచే భారీ ఎత్తున ఓటింగ్ లో పాల్గొనేందుకు ప్రజలు మక్కువ చూపడం ప్రజాస్వామ్య విజయం అన్నారు. ఈ స్థానం నుంచి జేకేఎన్ సీ మియాన్ అల్తాఫ్ అహ్మాద్ నుపోటీకి దింపగా, పీడీపీ నుంచి మెహబూబా ముఫ్తీ పోటీలో ఉన్నారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థిని నిలబెట్టలేదు.
హ్యాట్రిక్ ఖాయమే బీజేపీ అభ్యర్థి నిరాహువా..
బోలేనాథ్ ఆశీస్సులతో తన విజయం సునాయాసమేనని యపీ అజంగఢ్ బీజేపీ అభ్యర్థి దినేష్ లాల్ యాదవ్ నిరాహువా అన్నారు. ఆయన శనివారం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సీటును కైవసం చేసుకునే సత్తా బీజేపీకే ఉందన్నారు. దేశాభివృద్ధికి ప్రతీ ఒక్కరూ సహకరించాలన్నారు. దేశంలో మరోమారు బీజేపీ హ్యాట్రిక్ ఖాయమన్నారు.
సోనియాగాంధీ..
కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలు ఢిల్లీలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రియాంక గాంధీ వాద్రా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్యంలో పెద్ద ఎత్తున ప్రజలు ఓట్లేసేందుకు రావడం గర్వకారణమని ప్రియాంక గాంధీ స్పష్టం చేశారు.