గుజరాత్​ లో ఘోర ప్రమాదం 10మంది మృతి

ట్యాంకర్​ ను ఢీ కొన్న కారు

Apr 17, 2024 - 18:32
 0
గుజరాత్​ లో ఘోర ప్రమాదం 10మంది మృతి

గాంధీనగర్​: గుజరాత్​ లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బుధవారం సంభవించిన ఈ ప్రమాదంలో 10మంది మృతి చెందారు. అహ్మదాబాద్-వడోదర ఎక్స్‌ప్రెస్ హైవేపై నదియాడ్ సమీపంలో ఆయిల్ ట్యాంకర్ ను ఓ కారు వెనుక నుంచి వేగంగా బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. వారిలో ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందగా, ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని పోలీసులు వెల్లడించారు. మృతుల్లో ఒక మహిళ కూడా ఉంది. సమాచారం అందుకున్న ఎమర్జెన్సీ 108, పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. వెంటనే సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం జరగడంతో అహ్మదాబాద్-వడోదర ఎక్స్‌ప్రెస్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ప్రమాదంలో మృతదేహాలు నుజ్జునుజ్జయ్యాయి. వారిని గుర్తుపట్టలేనంత స్థితిలో ఉన్నారు.