యూఎన్ ఎల్ ఎఫ్–పీ 34 మంది లొంగుబాటు
సరిహద్దు దాటుతుండగా అడ్డుకున్న అస్సాం రైఫిల్స్
ఇంఫాల్: యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ బాంబే (యూఎన్ ఎల్ ఎఫ్–పీ) చెందిన 34 మంది అస్సాం రైఫిల్స్ ముందు లొంగిపోయారు. భారత్ – మయన్మార్ సరిహద్దు గుండా వీరు మణిపూర్ లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. అస్సాం రైఫిల్ వారిని అడ్డుకుంది. వీరి వద్ద ఆటోమేటిక్ ఆయుధాలు లభించడం ఆశ్చర్యకరం. శుక్రవారమే వీరంతా లొంగిపోయారని శనివారం అధికారులు ప్రకటించారు. వీరిని ప్రస్తుతం ఇంఫాల్ కు తరలించామన్నారు. మయన్మార్ లో సైనిక తిరుగుబాటుతో వీరంతా మణిపూర్ లోకి చొరబడుతున్నారు. మణిపూర్ లో 25 కిలోమీటర్ల సరిహద్దు ప్రాంతం ఇరు ప్రాంతాలకు ఫ్రీజోన్ గా ఉండడంతో దీన్ని అదనుగా చేసుకొని సరిహద్దును సులువుగా దాటుతారు. ప్రస్తుతం మణిపూర్ సరిహద్దు వద్ద భద్రత కట్టుదిట్టం చేయడంతో చొరబాట్లు చాలామేరకు ఆగాయి. ఈ నేపథ్యంలో మరోమారు చొరబాటుకు యత్నిస్తున్న వీరందరిని అస్సాం రైఫిల్స్ అడ్డుకోవడంతో వీరి సరెండర్ అయ్యారు.