జానకమ్మకు దేశ, విదేశాల్లో బహుళ శక్తిపీఠాలు
భారత పురాణేతిహాసాల్లో సీతమ్మ వారికి సంబంధించిన ఆలయాల వర్ణన ఉంది.
నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: భారత పురాణేతిహాసాల్లో సీతమ్మ వారికి సంబంధించిన ఆలయాల వర్ణన ఉంది. సీతమ్మ వారికి దేశ విదేశాల్లో పురాణాలను బట్టి ఒక్కో పురాణంలో ఒక్కోలా ఆలయాల వర్ణనను వివరించారు. దేవీ పురాణంలో 51 శక్తిపీఠాలు, దేవీ భగవత్‌లో 108 శక్తిపీఠాలు, దేవిగీతలో 72 శక్తిపీఠాల వర్ణన ఉంది. దేవీ పురాణంలో పేర్కొన్న 51 శక్తిపీఠాలలో కొన్ని విదేశాలలో కూడా స్థాపించబడ్డాయి. భారతదేశంలో మొత్తం 42 శక్తిపీఠాలు ఉన్నాయి. బంగ్లాదేశ్‌లో 4, నేపాల్‌లో 2, శ్రీలంక, పాకిస్తాన్, టిబెట్‌లలో ఒక్కొక్కటి చొప్పున శక్తిపీఠాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం..
1. హింగ్లాజ్ శక్తిపీఠ్– పాక్ లోని కరాచీలో ఉంది (ఈ ఆలయం వర్ణన ఓ ప్రముఖ తెలుగు సినిమాలో కూడా ఉంది). 2. కర్వీర్ శక్తిపీఠ్– మహారాష్ట్రలోని కొల్హాపూర్ నగరంలో ఉంది. 3. సుగంధ-సునంద– బంగ్లాదేశ్‌లోని షికార్‌పూర్‌లోని సోంధ్ నదికి సమీపంలో ఉంది. 4. కశ్మీర్-మహామాయ– పహల్‌గావ్. 5. జ్వాలాముఖి-సిద్ధిదా– హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా. 6. జలంధర్-త్రిపురమాలినీ– జలంధర్‌లో ఉంది. 7. వైద్యనాథ్-జయదుర్గా– ఝార్ఖండ్. 8. నేపాల్-మహామాయ, 9. మానస్-దాక్షాయణి, 10. విర్జా-విర్జాక్షేతర్, 11. గండకీ-గండకి ముక్తినాథ్, 12. బహులా (చండికా) అమ్మవారు, 13. ఉజ్జయిని- మాంగల్య చండిక, 14. త్రిపుర-త్రిపూర్ సుందరి, 15. చత్తాల్, 16. త్రిస్రోత, 17. కామగిరి, 18. ప్రయాగ, 19. యుగాద్య, 20. జయంతి, 21. కాళీపీఠ్ , 22. కిరీట్, 23. వారణాసి- విశాలాక్షి, 24. కన్యాశ్రమం, 25. కురుక్షేత్ర భద్రకాళి, 26. మణిదేవిక్- గాయత్రి, 27. శ్రీ శైల్, 28. కంచి- దేవగర్భ, 29. కల్మాధవ్- కాళీ దేవి, 30.శోండేష్- నర్మద (శోనాక్షి), 31. రామగిరి- శివాని, 32. బృందావనం- ఉమా, 33. శుచి- నారాయణి, 34. పంచసాగర్-వారాహి పంచసాగర్, 35. కరాటోయ బీచ్ - అపర్ణ మాత, 36. శ్రీ పర్వతం, 37. విభాష్, 38. ప్రభాస్- చంద్రభాగ, 39. భైరవ పర్వతం, 40. జనస్థాన్, 41. సర్వశైల కోటిలేశ్వర్ 42.రత్నావళి - కుమారి, 43. మిథిలా- ఉమా (మహాదేవి), 44. నల్హతి - కాళికా తారాపీఠ్, 45. కర్నాట్-జయదుర్గా, 46. వక్రేశ్వర్- మహిషమర్దిని, 47. యశోర్- యశోరేశ్వరి, 48. అట్టహాస్- ఫుల్రా, 49. నందిపూర్-నందిని అమ్మ, 50. లంక- ఇంద్రాక్షి.