హరియాణా బస్సులో అగ్నిప్రమాదం 10మంది మృతి, 28 మందికి గాయాలు
10 dead, 28 injured in Haryana bus fire
హరియాణా: శుక్రవారం అర్థరాత్రి హరియాణాలోని కుండ్లి మనేసర్ పాల్వాల్ ఎక్స్ ప్రెస్ వేపై ఓ బస్సు మంటల్లో కాలిపోయింది. ఈ ప్రమాదంలో పదిమంది మృతి చెందారు. 28మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిందరిని పోలీసులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పంజాబ్ లోని లూథియానా, హోషియార్ పూర్, చండీగఢ్ లకు చెందిన వారని పోలీసులు తెలిపారు. వీరంతా దగ్గరి బంధువులున్నారు. బనారస్, మధుర దర్శనానికి టూరిస్టు బస్సులో బయలుదేరానని తెలిపారు. దర్శనం అనంతరం 1.30 గంటల ప్రాంతంలో పాల్వాల్ ఎక్స్ ప్రెస్ వే వద్దకు రాగానే హఠాత్తుగా బస్సులో మంటలు చెలరేగాయన్నారు. వెంటనే గమనించిన స్థానికులు ఓ వైపు మంటలను ఆర్పుతూ బస్సులోని వారిని కాపాడుతూనే పోలీసులకు ఫోన్ చేశారని తెలిపారు. వెంటనే అగ్నిమాపక శాఖ, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టామన్నారు. బస్సులోని మంటలను పూర్తిగా అదుపు చేశామన్నారు. బస్సులో మొత్తం 60 మంది వరకు ప్రయాణిస్తున్నారని తెలిపారు. పది మంది మృతి చెందారని, 28 మంది వరకు కాలిన గాయాలయ్యాయన్నారు. వారందరిని స్థానిక ఆసుపత్రిలో చేర్పించి చికిత్సనందిప చేస్తున్నామన్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద విషయాన్ని తెలుసుకున్న నటుడు, ఎంపీ రాజ్ బబ్బర్ క్షతగాత్రులను పరామర్శించారు.
.............