ప్రచారం సమాప్తం ఐదో విడత పోలింగ్ కు సర్వం సిద్ధం
పశ్చిమ బెంగాల్ లో భద్రత కట్టుదిట్టం
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఐదో విడత ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రం 5 గంటలతో ముగియనుంది. మే 20వ తేదీన ఎన్నికల నిర్వహణకు ఈసీ సర్వం సిద్ధం చేస్తోంది.
సమస్యాత్మక ప్రాంతాల్లో అత్యధికంగా పశ్చిమ బెంగాల్ లో భద్రతను కట్టుదిట్టం చేసింది. కాగా 2019లో ఐదో విడతలో జరిగిన ఎన్నికల్లో 62.01 శాతం ఓట్లు పోలయ్యాయి. అత్యధికంగా పశ్చిమ బెంగాల్ లో 80.13 శాతం కాగా, అత్యల్పంగా జమ్మూ కశ్మీర్ లో 34.06 శాతం ఓట్లు పోలయ్యాయి.
ప్రస్తుతం 8 రాష్ర్టాల్లోని 49 సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, ఒడిశా, జార్ఖండ్, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలైన జమ్మూ కాశ్మీర్, లడఖ్‌లలోని మొత్తం 49 స్థానాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఐదో రౌండ్‌లో ఓటింగ్ జరుగుతున్న స్థానాల్లో ఉత్తరప్రదేశ్‌లో 14, మహారాష్ట్రలో 13, పశ్చిమ బెంగాల్‌లో 7, బీహార్, ఒడిశాలో ఐదు స్థానాలు ఉన్నాయి. ఇది కాకుండా, ఈ దశలో ఝార్ఖండ్‌లోని మూడు స్థానాలు, జమ్మూ-కశ్మీర్ మరియు లడఖ్‌లలో ఒక్కో స్థానానికి కూడా ఓటింగ్ జరగనుంది. 695 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఐదో దశ పోలింగ్ పూర్తి అయితే మొత్తం 543 సీట్లకు గాను 428 స్థానాల్లో పోలింగ్ ప్రక్రియ సమాప్తం అవుతుంది. 115 స్థానాలకు గాను ఆరు, ఏడో విడతలో పోలింగ్ జరగనునంది. జూన్ 1 వరకు పోలింగ్ ప్రక్రియ పూర్తి కానుండగా, జూన్ 4వ తేదీన ఈసీ ఫలితాలను వెల్లడించనుంది.
.......................