ఓటు ఖర్చెంత?
How much does a vote cost?
నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: ఎన్నికల కమిషన్ ఓటింగ్ కు ఎంత ఖర్చు పెడుతుంది? ఒక్క ఓటుకు ఎంత ఖర్చవుతుంది. ఈ ఖర్చును ఎవరు భరిస్తారో తెలుసా? అయితే తెలుసుకోండి..
1952 నుంచి 2023 వరకు సగటును ప్రతీయేటా ఆరుసార్లు దేశంలో ఎన్నికలు జరిగాయి. 1951లో తొలి లోక్ సభ ఎన్నికలకు ప్రభుత్వం రూ. 10.5 కోట్లను ఖర్చు చేసింది. 17 కోట్ల మంది ఓటింగ్ చేశారు. అప్పట్లో ఒక్కో ఓటుపై రూ. 0.65 పైసలు ఖర్చయ్యింది. 2024 లోక్ సభ ఎన్నికల్లో రూ. 1.35 లక్షల కోట్లు ఖర్చు చేశారు. 2004 లోక్‌సభ ఎన్నికల్లో ఒక్కో ఓటరుకు రూ.12, 2009 లోక్‌సభ ఎన్నికల్లో ఒక్కో ఓటరుకు రూ.17 ఖర్చు చేశారు. 2014 ఎన్నికల్లో ఒక్కో ఓటరుకు దాదాపు రూ.46 ఖర్చు కాగా, 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఒక్కో ఓటరుకు రూ.72కు పెరిగింది. 1957లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఎన్నికల సంఘం కేవలం రూ.5.9 కోట్లు ఖర్చు చేసిందని, అంటే ఒక్కో ఓటరుకు ఎన్నికల ఖర్చు కేవలం రూ. 0. 30 పైసలు ఖర్చయ్యాయి. 1999లో లోక్‌సభ ఎన్నికలలో రూ.880 కోట్లు ఖర్చు చేయగా, 2004 ఎన్నికల్లో ఈ వ్యయం రూ.1200 కోట్లకు పెరిగింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో దాదాపు రూ.3870 కోట్లు ఖర్చు కాగా, 2019 ఎన్నికల లెక్కల ప్రకారం ఖర్చు దాదాపు రూ.6500 కోట్లు.
ఖర్చులు ఎవరు భరిస్తారు..
అక్టోబరు 1979లో శాంతిభద్రతల మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం, లోక్‌సభ ఎన్నికల ఖర్చును కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఖర్చు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి.