హైదరాబాద్ లో ఎన్ఐఏ సోదాలు
హైదరాబాద్‌లోని పలుచోట్ల జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) సోదాలు చేస్తున్నది.
నా తెలంగాణ, హైదరాబాద్: హైదరాబాద్‌లోని పలుచోట్ల జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) సోదాలు చేస్తున్నది. మావోయిస్టు పార్టీతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో హిమాయత్ నగర్లో ఉంటున్న విరసం నేత వరవరరావు అల్లుడు, వీక్షణం పత్రిక సంపాదకుడు ఎన్.వేణుగోపాల్ నివాసంలో గురువారం తెల్లవారుజామన 4 గంటల నుంచే ఎన్ఐఏ తనిఖీలు చేపట్టింది. సుమారు 5 గంటలపాటు ఆయన ఇంట్లో దాడులు కొనసాగాయి. ఇటీవల మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు సందీప్ దీపక్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. దీపక్ దగ్గర దొరికిన సమాచారం మేరకు వేణుగోపాల్ నివాసంలో సోదాలు చేపట్టిన ఎన్ఐఏ అధికారులు.. ఆయన సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అటు ఎల్బీనగర్లోని రవి శర్మ, అనురాధ దంపతుల ఇంట్లోనూ అధికారులు సోదాలు నిర్వహించారు. జాతీయ దర్యాప్తు సంస్థ తనిఖీలపై వేణుగోపాల్ స్పందించారు. ఎన్ఐఏ బృందం తన నివాసానికి సెర్చ్ వారెంట్‌తో వచ్చిందని ఆయన చెప్పారు.