కక్షసాధింపు అవసరం బీజేపీకి లేదు కేంద్రమంత్రి జి.కిషన్​ రెడ్డి

మద్యం కుంభకోణం కేసులో కల్వకుంట్ల కవిత అరెస్ట్ వెనుక కక్ష సాధింపు లేదని, ఆ అవసరం బీజేపీకి లేదని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి.కిషన్​ రెడ్డి అన్నారు.

Mar 15, 2024 - 20:31
 0
కక్షసాధింపు అవసరం బీజేపీకి లేదు కేంద్రమంత్రి జి.కిషన్​ రెడ్డి

నా తెలంగాణ, హైదరాబాద్​: మద్యం కుంభకోణం కేసులో కల్వకుంట్ల కవిత అరెస్ట్ వెనుక కక్ష సాధింపు లేదని, ఆ అవసరం బీజేపీకి లేదని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి.కిషన్​ రెడ్డి అన్నారు. విచారణ సంస్థలు తమ పని తాము చేసుకుంటున్నాయని స్పష్టం చేశారు. కవిత అరెస్ట్ పై శుక్రవారం మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ఐటీ, ఈడీ అధికారులు గతంలో నోటీసులిచ్చారని, సుదీర్ఘ సోదాల అనంతరమే అరెస్ట్​ నోటీసులిచ్చి ఈడీ అదుపులోకి తీసుకుందన్నారు. ఈడీ విచారణకు కవిత సహకరించాలని మంత్రి సూచించారు. ఇన్నాళ్లు కవిత తప్పించుకొని తిరగారని మంత్రి గుర్తు చేశారు. 

ఆధారాలను బట్టే విచారణలు, అరెస్టు: ఈటల

దేశంలో విచారణలు జరగడం ఇదే తొలిసారేం కాదని, ఈడీ దగ్గరున్న ఆధారాలను బట్టే విచారణలు, అరెస్టు జరుగుతాయని  కవిత అరెస్ట్​ కూడా ఇదే నేపథ్యంలో జరిగిందని మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు ఈటల  రాజేందర్​ అన్నారు. కవితపై కక్ష సాధింపు చర్యలకు దిగాల్సిన అవసరం బీజేపీకి లేదన్నారు.