హైదరాబాద్ విమోచన చరిత్ర తెలుసుకుందాం
సాలర్ జంగ్ మ్యూజియంలోని వర్చువల్ మ్యూజియంలో హైదరాబాద్ విమోచన పోరాట చరిత్రను కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో భారత ప్రభుత్వం అత్యద్భుతంగా ప్రదర్శిస్తున్నదని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు.
నా తెలంగాణ, హైదరాబాద్: సాలర్ జంగ్ మ్యూజియంలోని వర్చువల్ మ్యూజియంలో హైదరాబాద్ విమోచన పోరాట చరిత్రను కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో భారత ప్రభుత్వం అత్యద్భుతంగా ప్రదర్శిస్తున్నదని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు. నాటి పోరాటానికి సంబంధించిన పొటో గ్యాలరీలు, నిక్షిప్త డాక్యుమెంట్లు, ఇంటరాక్టివ్ మ్యాప్‌లు, వార్తాపత్రికల క్లిప్పింగ్‌లతో త్రీడీ వర్చువల్ రూపంలో కళ్లకు కట్టినట్లు ప్రదర్శిస్తున్నదని గురువారం ఒక ట్వీట్ లో ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా యువత ఈ గ్యాలరీని సందర్శించి, మన ఉద్యమ నాయకుల చరిత్ర, వారసత్వాన్ని తెలుసుకోవాలని కిషన్ రెడ్డి సూచించారు.