జీపీఎస్ టోల్‌కు సిద్ధం రాజ్యసభలో మంత్రి గడ్కరీ
శాటిలైట్ ఆధారిత జీపీఎస్ ద్వారా టోల్ కలెక్షన్ సిస్టమ్ ను త్వరలో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు.
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: శాటిలైట్ ఆధారిత జీపీఎస్ ద్వారా టోల్ కలెక్షన్ సిస్టమ్ ను త్వరలో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా గురువారం సమాధానమిచ్చారు. కొత్త విధానంలో వాహనం నంబర్ ప్లేట్ తో నేరుగా బ్యాంకు ఖాతాల నుంచి టోల్ ను మినహాయించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న టోల్ ప్లాజాలను తొలగించి జాతీయ రహదారిపై ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కొత్త టోల్ విధానం ద్వారా సాఫీ ప్రయాణానికి మార్గం సుమగమవుతుందని గడ్కరీ స్పష్టం చేశారు. ఇప్పటివరకు ఎనిమిది కోట్ల పదమూడు లక్షలకు పైగా ఫాస్ట్‌ట్యాగ్‌లు జారీ చేశామని, సగటు రోజువారీ వసూళ్లు రూ. 170 నుంచి రూ. 180 కోట్లని మంత్రి తెలిపారు.