అన్యమనస్క పొత్తు

కాంగ్రెస్​, ఎన్సీపీపై బీజేపీ రైనా విమర్శలు

Aug 23, 2024 - 13:50
 0
అన్యమనస్క పొత్తు

శ్రీనగర్​: జమ్మూకశ్మీర్​ ఎన్నికల్లో కాంగ్రెస్​, ఎన్సీపీ పొత్తు ఉండబోదని చెబుతూనే, అన్యమనస్కంగానే చేతులు కలిపారని బీజేపీ పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు రవీందర్​ రైనా ఆరోపించారు. శుక్రవారం ఆయన ఈ రెండు పార్టీల పొత్తుపై మీడియాతో మాట్లాడారు. రాత్రికి రాత్రే వీరిద్దరి మధ్య పొత్తు ఖాయం కావడం చూస్తుంటే వీరికి ఓటమి భయం పట్టుకుందన్నారు. విపక్షాలు ఎన్ని కుయుక్తులు పన్నినా జమ్మూకశ్మీర్​ లో బీజేపీ విజయం ఖాయమన్నారు. మోదీ నేతృత్వంలోని అభివృద్ధిపై ముస్లిం సమాజం కూడా హర్షం వ్యక్తం చేస్తుందన్నారు. అందుకే జమ్మూకశ్మీర్​లోని అన్ని పార్టీలకు ఓటమి భయం వెన్నాడుతోందని రైనా విమర్శించారు. ఎవరెన్ని పొత్తులు పెట్టుకున్నా, కుట్రలు పన్నినా బీజేపీ గెలుపు ఖాయమని రవీందర్​ రైనా స్పష్టం చేశారు.