టెక్నాలజీలో మంత్రి అశ్విని​ ప్రతిభావంతమైన వ్యక్తి

Minister Ashwini is a talented person in technology

Sep 8, 2024 - 18:00
 0
టెక్నాలజీలో మంత్రి అశ్విని​ ప్రతిభావంతమైన వ్యక్తి
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: టెక్నాలజీ, ఏఐ రంగంలో అభివృద్ధికి కృషి చేస్తున్న సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్​ అత్యంత ప్రతిభావంతమైన వ్యక్తులలో ఒకరిగా నిలిచారు. టైమ్​ మ్యాగజైన్​ లో ఆయనకు చోటు లభించింది. మంత్రిత్వ శాఖ ఆదివారం ఈ విషయాన్ని వెల్లడించింది. ఆయన నాయకత్వంలో రానున్న ఐదేళ్లలో భారత్​ సెమీకండక్టర్ల తయారీలో తొలి ఐదు దేశాలలో ఒకటిగా అవతరించాలనే ఆశతో ఉందని తెలిపింది. భారత్​ అనేక రంగాల్లో ఇప్పటికే ఏఐ సాంకేతికత పనులు ప్రారంభమై విస్తృతమయ్యాయని తెలిపింది. ఇందుకోసం ప్రత్యేక వర్క్​ ఫోర్స్​ ను కూడా విద్యావ్యవస్థ ద్వారా అభివృద్ధికి నాందీ పలికిందని తెలిపింది. 
 
మంత్రి తరువాత ఈ జాబితాలో మరికొందరి పేర్లను టైమ్​ మ్యాగజైన్​ పేర్కొంది. ఇందులో గుగూల్​ సీఈవో సుందర్​ పిచాయ్​, మైక్రోసాఫ్ట్​ సీఈవో సత్య నాదెళ్ల, ఓపెన్​ ఏఐ సీఈవో సామ్​ ఆల్ట్​ మన్​, మెటా సీఈవో మార్క్​ జుకర్​ బర్గ్​, ఇన్ఫోసిస్​ సహ వ్యవస్థాపకుడు నందన్​ నీలేకనిలు ఏఐ సాంకేతిక వృద్ధికి గణనీయమైన కృషి చేస్తున్నారని తెలిపింది.