రాజీనామాపై రేపు మాట్లాడతా!

ఎమ్మెల్సీ జీవన్​ రెడ్డి సీనియర్లను వదులుకోం: భట్టి

Jun 25, 2024 - 14:51
 0
రాజీనామాపై రేపు మాట్లాడతా!

నా తెలంగాణ, హైదరాబాద్​: ఎమ్మెల్సీ పదవికి రాజీనామాపై రేపు (బుధవారం) మాట్లాడతానని జీవన్​ రెడ్డి తెలిపారు. రాజీనామా సమర్పించేందుకు కౌన్సిల్​ చైర్మన్​ సమయం కేటాయించాలని కోరారు. మంగళవారం జీవన్​ రెడ్డిని కలిసి బుజ్జగిందుకు డిప్యూటీ స్పీకర్​ భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్​ బాబులు ఆయన ఇంటికి చేరుకొని సముదాయించారు. జీవన్​ రెడ్డి నిర్ణయంప ఉత్కంఠత ఇంకా కొనసాగుతోంది.

కాగా డిప్యూటీ సీఎం భట్టి మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్​ పార్టీలో సీనియర్​ నేతగా ఉన్న జీవన్​ రెడ్డికి పార్టీ సముచిత గౌరవం ఇస్తుందన్నారు. ఆయన సేవలు కాంగ్రెస్​ లో కొనసాగుతాయన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సీనియర్లను కాంగ్రెస్​ వదులుకునేందుకు సిద్ధంగా లేదన్నారు. ఆయనతో చర్చించామని ఆయన విన్నపాలను పరిగణనలోకి తీసుకుంటామని భట్ట తెలిపారు. జీవన్​ రెడ్డికి పార్టీలో సముచిత స్థానం లభిస్తుందని తెలిపారు.