విశ్వగురు నిర్ణయాలు? రాజ్యాంగానికే తొలి ప్రాధాన్యం

Vishwaguru's decisions? Constitution is the first priority

Jun 9, 2024 - 14:11
 0
విశ్వగురు నిర్ణయాలు? రాజ్యాంగానికే తొలి ప్రాధాన్యం

విద్రోహ శక్తులకు చెల్లుచీటే

శత్రువులను వదిలేది లేదు

పీవోకే స్వాధీనం పక్కా..

యూసీసీ అమలులో అనుమానక్కరలేదు

ఒకే దేశం ఒకే ఎన్నికలు

యూఎన్​ఎస్​ సీలో సభ్యత్వం

మోదీ పాలనలో నిర్ణయాలివే!

నా తెలంగాణ, సెంట్రల్​ డెస్క్​:

విశ్వగురు ముచ్చటగా మూడోసారి ప్రమాణ స్వీకారానికి అంతా సిద్ధమైంది. ఆదివారం 7 గంటలకు ప్రధాని పదవికి మూడోసారి నరేంద్ర మోదీ మనసా వాచా కర్మణ: ప్రమాణ స్వీకారం చేయనున్నారు. భారత రాజ్యాంగానికి అత్యంత ప్రాధాన్యమివ్వనున్నారు. అయితే మోదీ గెలిచే ముందు కూడా పదే పదే పెద్ద నిర్ణయాలుంటాయని చెప్పారు. ఆయన మంత్రి వర్గమైతే ఏకంగా ఆయా ప్రాధాన్యతాంశాలను కూడా వివరిస్తూ మరీ చెప్పారు. మూడోసారి ప్రమాణ స్వీకారం చేపట్టాక మోదీ తీసుకోబోయే నిర్ణయాలేంటీ? అనే సందేహం ప్రతీ ఒక్కరిలోనూ మెదులుతోంది. 

నిర్ణయాలేమై ఉండొచ్చు?..

అతి ముఖ్యమైన నిర్ణయాలు ఏమై ఉండొచ్చన్న అంశాలు సర్వత్రా చర్చకు వస్తున్నాయి. అయితే ఆయన మంత్రి వర్గం, మోదీ ప్రకటించిన ప్రకారం పీవోకే స్వాధీనం, యూసీసీ అమలు, మహిళా రిజర్వేషన్లు, వన్​ నేషన్​ వన్​ ఎలక్షన్​,  యూఎన్​ ఎస్​ సీ (ఐక్యరాజ్య సమితి భద్రతా మండిలో సభ్యత్వం) లాంటి విషయాలను అమలు చేయనుండి. 

2019 నుంచి 2004 పెద్ద నిర్ణయాలు..

ఇప్పటికే 2019 నుంచి 2004 మధ్య ప్రపంచవ్యాప్తంగా పరిష్కారం సమస్యలకు కూడా భారత్​ పరిష్కారం చూపింది. అంతేగాకుండా భారత్​ లో అయోధ్య రామ మందిర నిర్మాణం, ఆర్టికల్​ 370 తొలగింపు, యూసీసీ పౌరసత్వ చట్టం అమలు లాంటి పెద్ద నిర్ణయాలను అవలీలగానే తీసుకుంది. 

సాధ్యమేనా..

ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద నిర్ణయాలు అన్న వెంటనే ప్రపంచ దేశాల్లో ఆలోచనలు, సందేశాలు, ప్రశ్నలు, సమాధానాల కోసం ఇప్పటికే పలు పలు దేశాలు ఆలోచనలో పడ్డాయి. అదే సమయంలో భారత్​ వ్యతిరేక శక్తులు ఆ నిర్ణయాలను అమలు చేయనీయొద్దనే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఆ నిర్ణయాల అమలు కోసం మోదీ తమ శర్వశక్తులు ఒడ్డనున్నారనేది కొన్ని దేశాలు విస్మరిస్తున్నాయి. మరికొన్ని దేశాలు భారత్​ కు అనుకూలం, వ్యతిరేకంగా కాకుండా తటస్థంగా నిలుస్తున్నాయి. 

అనుకూల, వ్యతిరేక దేశాలు..

సూటిగా చెప్పాలంటే భారత్​ కు శత్రుదేశాలు పాకిస్థాన్​, చైనా, టర్కీ లాంటి కొన్ని ఇస్లామిక్​ దేశాలున్నాయి. అదే సమయంలో మరికొన్ని ఇస్లామిక్​ దేశాలు భారత్​ కు అత్యంత ప్రాధాన్యతనిచ్చేవిగా ఉన్నాయి. అందులో మొదటి వరుసలో సౌదీ అరేబియా ఉన్నట్లు చెప్పుకోవచ్చు. ఇక ఆంగ్లదేశాలకు సంబంధించి శత్రుదేశాలుగా ఉన్నవి కెనడా దాని మిత్ర దేశాలు.

మిత్రదేశాలుగా ఫ్రాన్స్​ తొలివరుసలో ఉండగా, అమెరికా, బ్రిటన్​ నాటోదేశాలు కూడా భారత్​ తో మిత్ర దేశాలుగా కొనసాగుతున్నాయి. అదే సమయంలో ఆది నుంచి అంటే సుమారు 1900 శతాబ్ధం నుంచి రష్యా భారత్​ కు మిత్ర దేశమే. అనేకసార్లు, అనేక దేశాలు భారత్​–రష్యాల మధ్య పొరపొచ్చాలు సృష్టించాలని విఫలయత్నం చేశారు. అయినా ప్రస్తుత పరిస్థితుల్లో కూడా రష్యాతో ఒక్కటంటే ఒకే ఒక్క దేశం నిర్విఘ్నంగా తమ వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలను నిర్వహిస్తున్నది భారత్​ కావడం గమనార్హం. 

చైనా.. పాక్​..

చైనా, పాక్​ దేశాలు భారత్​ కు ఎప్పటికీ శత్రుదేశాలే. వాస్తవాలు గమనిస్తే చరిత్ర పటంలో పాకిస్థాన్​ అనే దేశమే లేదు. భారత్​ లో 1960 కంటే ముందు ఆర్థిక స్థితికి చైనా కళ్లుకుట్టి అంతర్గత కలహాలకు ఆజ్యం పోసింది. తద్ఫలితంగా అప్పటికే ఏర్పాటైన పాకిస్థాన్​ కాస్త భారత్​ కు పూర్తి శత్రుదేశంగా అవతరించి ఉగ్రవాదాన్ని భారత్​ పైకి ఎగజిమ్ముతూ సంతోషిస్తోంది. అదే సమయంలో ఉగ్రవాదులు బలవడానికి జిహాద్​ అనే కొత్త పేరు (నిర్వచనాన్ని) రూపొందించింది. చైనా సూదూర లక్ష్యాలకు ప్రస్తుత కాలంలో చెక్​ పడింది.

మోదీ నేతృత్వంలో ఇప్పటికే తీసుకున్న నిర్ణయాలు కాకుండా, మరోమారు పెద్ద నిర్ణయాలు తీసుకోనున్నారనే విషయంపైనే పూర్తిగా చైనాలో కలవరపాటు మొదలైంది. ఇప్పటికే ఆర్థిక రంగంలో చైనాకు సుదూరంలో ఉన్నా, అతి త్వరలో చైనాను వెనక్కు నెట్టే నిర్ణయాలకు మోదీ అంకురార్పణ చేయనున్నారు. ఇవే నిర్ణయాలు చైనాను కలవరపాటుకు గురి చేస్తున్నాయి. అందుకే పాక్​ తో కలిసి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ వన్​ రోడ్​ వన్​ బెల్ట్​ అనే నిర్ణయాన్ని భారత్​ సరిహద్దుల వెంట నిర్మించే నిర్ణయాలు తీసుకొని కయ్యానికి కాలుదువ్వే నిర్ణయాలను తీసుకుంటుంది. కానీ అదే సమయంలో చైనా భద్రతను, ప్రజాస్వామ్యాన్ని,ఉద్యోగుల, కార్మికుల మానప్రాణాలను సైతం విస్మరిస్తోంది. ఇటీవలే ఆ ప్రాజెక్టులో భాగంగా చైనాకు చెందిన వారిపై వరుస దాడుల్లో అనేకమంది మృతి చెందిన విషయం తెలిసిందే. మరోవైపు ఇతరదేశాలపైకి ఉగ్రవాదాన్ని ఎగదోసే పాక్​ కాస్త ఈ ప్రాజెక్టులో చైనాకు పూర్తి భద్రతనివ్వడంలో వరుసగా విఫలమవుతూ వస్తోంది. 

ఏది ఏమైనా మోదీ నేతృత్వంలోని @ 3.0 పాలన పూర్తి నీతి నిజాయితీలతో కూడినదిగా ఉండడమే గాక దేశ కీర్తి ప్రతిష్ఠలకు భంగం కలిగించే వారిపై రామబాణాన్ని ఎక్కుపెట్టనుంది. అదే సమయంలో దేశంలోని అంతర్గత విద్రోహకర శక్తులకు పూర్తిగా చెల్లుచీటి పడనుందనేది వాస్తవంగానే కనిపిస్తోంది.