నాణ్యమైన ఆధునిక వైద్యసేవలు ఏయిమ్స్​ 63 శాతం పనులు పూర్తి

కేంద్రమంత్రి జి.కిషన్​ రెడ్డి

Jul 27, 2024 - 13:15
 0
నాణ్యమైన ఆధునిక వైద్యసేవలు  ఏయిమ్స్​ 63 శాతం పనులు పూర్తి

నా తెలంగాణ, హైదరాబాద్​: తెలంగాణ ప్రజలకు నాణ్యమైన, ఆధునికమైన ఆరోగ్య సేవలందించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ రాష్​ర్ట బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్​ రెడ్డి అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ముందుచూపుతో బీబీ నగర్​ ఏయిమ్స్​ ను రూ. 1500 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ ఆసుపత్రి పనులు 63 శాతం పూర్తి అయ్యాయని కిషన్​ రెడ్డి శనివారం సామాజిక మాధ్యమంగా వెల్లడిస్తూ హర్షం వ్యక్తం చేశారు. 

ఈ ఆసుపత్రిలో 750 పడకలు ఉండనుండగా, 100 సీట్ల మెడికల్​ కాలేజీ, 60 సీట్ల నర్సింగ్​ కళాశాలు, 30 పడకల ఆయుష్​ బ్లాక్​ లను ఏర్పాటు చేశారు. 

201 ఎకరాల సువిశాల స్థలంలో దీన్ని నిర్మించారు. ఆసుపత్రి పూర్తి నిర్మాణం పూర్తి అయితే అత్యాధునిక స్థాయిలో స్పెషాలిటీ, సూపర్​ స్పెషాలిటీ విభాగాల ద్వారా వైద్యం అందనుంది. 

2019లోనే ఎంబీబీఎస్​ విద్యార్థులతో తొలి బ్యాచ్​ ను ప్రారంభించారు. అనంతరం కూడా పలు విభాగాలు ప్రారంభిస్తూ వైద్యసేవలు అందిస్తున్నారు. అంతేగాక ఏయిమ్స్​ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఉచిత వైద్యసేవలను కూడా అందిస్తున్నారు. ప్రధానమంత్రి స్వాస్థ సురక్ష యోజన కింద ఈ ఆసుపత్రిని నిర్మిస్తున్నారు.