కాంగ్రెస్​ నాయకుడిని కొట్టిన డీకే శివకుమార్​!

ఈ వీడియో కాస్త సామాజిక మాధ్యమాల్లో వైరల్​ గా మారడంతో ఆదివారం వెలుగు చూసింది.

May 5, 2024 - 19:05
 0
కాంగ్రెస్​ నాయకుడిని కొట్టిన డీకే శివకుమార్​!

బెంగళూరు: కాంగ్రెస్​ నాయకుడిని డీకె శివకుమార్​ కొట్టారు. ఈ వీడియో కాస్త సామాజిక మాధ్యమాల్లో వైరల్​ గా మారడంతో ఆదివారం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని హావేరీలో ఎన్నికల ప్రచారానికి డీకె. శివకుమార్​ వెళ్లారు. ఆయనకు పెద్ద యెత్తున స్వాగతం లభించింది. ఈ నేపథ్యంలో ఆయన్ను కలవాలన్న ఉత్సాహంతో ఆ పార్టీ నాయకుడు అల్లావుద్దీన్​ మనియార్​ డీకె. శివకుమార్​ భుజంపై చేయి వేశాడు. దీంతో శివకుమార్​ కు కోపం నషాళానికికెక్కింది. అల్లావుద్దీన్​ ను చెంపపై కొట్టాడు. వెంటనే స్పందించిన సెక్యూరిటీ సిబ్బంది ఆయన్ను పక్కకు నెట్టేశారు. ఈ హఠాత్​ పరిణామంతో మునిసిపల్​ సభ్యుడు అయిన అల్లావుద్దీన్​ కాస్త తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. బడా నేతలన్నాక చిన్నస్థాయి నాయకులకు క్రేజ్​ ఎక్కువేనని అన్నారు. అంతమాత్రాన చేయి చేసుకోవడం సరికాదన్నారు. తాను డీకే వెంట సెల్ఫీ తీసుకోవాలనే ఉద్దేశంతోనే వెళ్లానని మంది మార్భలం ఎక్కువగా ఉండడంతో పొరపాటున భుజంపై చేయి పడిందే తప్ప కావాలని ఆయనపై చేయి వేయలేదని అల్లావుద్దీన్​ వాపోయారు.