నేటి నుంచే భోజ్​శాలలో ఏఎస్​ఐ సర్వే

ఎంపీ కోర్టు ఆదేశాలతో యాక్షన్​ ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు

Mar 21, 2024 - 18:45
 0
నేటి నుంచే భోజ్​శాలలో ఏఎస్​ఐ సర్వే

భోపాల్: మధ్యప్రదేశ్​లోని భోజ్​శాలలో మార్చి 22 నుంచి ఏఎస్​ఐ సర్వేకు మధ్యప్రదేశ్ కోర్టు ఆదేశాలిచ్చింది. సర్వేతో మొదట ఇక్కడ ఎలాంటి నిర్మాణాలుండేవన్న విషయం స్పష్టం కానుంది. హిందూ ఫ్రంట్​ ఫర్​ జస్టిస్​ అనే సంస్థ ద్వారా మధ్యప్రదేశ్​ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్​పై కోర్టు సర్వే చేపట్టాలని ఆర్కియాలాజికల్​ సర్వే ఆఫ్​ ఇండియా (ఎఎస్​ఐ)ను ఆదేశించింది. భోజ్​శాలలో ముస్లింలు ప్రార్థనలు చేయకుండా ఆదేశాలివ్వాలని, హిందువులు పూజలు చేసుకునేందుకు అనుమతించాలని పిటిషన్​లో పేర్కొన్నారు. దీనిపై ముస్లిం పక్షం కూడా మరో పిటిషన్​ దాఖలు చేసింది. రెండు పిటిషన్లను విచారించిన మధ్యప్రదేశ్​ హైకోర్టు తీర్పును రిజర్వులో ఉంచింది. హిందూ ఫ్రంట్​ ఫర్​ జస్టిస్​ తరఫున న్యాయవాదులు హరిశంకర్, విష్ణుశంకర్​జైన్​లు పిటిషన్​ దాఖలు చేశారు. గతంలో జరిగిన సర్వేలో భోజ్ శాల వాగ్దేవి దేవాలయం ఉండేదని సర్వేలో తేలిందని న్యాయవాదులు పేర్కొన్నారు.