ఉద్రిక్తతలకు కారణం స్వదేశాలకు పంపే ఏర్పాట్లు
నమాజు వివాదంపై గుజరాత్ యూనివర్సిటీ నిర్ణయం
గాంధీనగర్: గుజరాత్ యూనివర్సిటీలో ఏడుగురు విదేశీ విద్యార్థులు వెంటనే హస్టల్ ఖాళీ చేయాలని యూనివర్సిటీ ఆదివారం ఆదేశాలు జారీ చేసింది. వీరి వల్ల యూనివర్సిటీ వాతావరణం ఉద్రిక్తంగా మారడం ఇష్టం లేదని అందుకే వీరిని వారి వారి దేశాలకు పంపించి వేస్తామని పేర్కొంది. వీరిని తిరిగి పంపే చర్యలపై ఆఫ్ఘన్, గాంబియన్ ప్రతినిధి బృందంతో యూనివర్సిటీ భద్రతా చర్యలపై వైస్- ఛాన్సలర్సమావేశం కూడా నిర్వహించారు. చదువులు కూడా పూర్తి చేసుకున్నందున హస్టల్ ఖాళీ చేయడంతోపాటు తమ తమ దేశాలకు తిరిగి వెళ్లే ఏర్పాట్లను కూడా చేశామని యూనివర్సిటీ వెల్లడించింది. మార్చి 16న ఈ ఏడుగురు విద్యార్థులు వర్సిటీ ప్రాంగణంలో నమాజ్ చేయడం వివాదాస్పమైంది. అప్పట్లో దీనిపై తీవ్ర వివాదం చెలరేగి యూనివర్సిటీలో భారీ భద్రత చర్యలు చేపట్టాల్సి వచ్చింది. ఈ పరిణామాలన్నీ దృష్టిలో పెట్టుకున్న యూనివర్సిటీ ఆయా దేశాలకు చెందిన ప్రతినిధులతో మాట్లాడి వీరిని తిరిగే పంపించే ఏర్పాట్లు చేసినట్లు స్పష్టం అవుతుంది.