హస్తంలో చిచ్చురేపుతున్న కులగణన

ఖర్గేకు లేఖ రాసిన సీడబ్ల్యూసీ సభ్యుడు ఆనంద్​ ఇందిరా, రాజీవ్​లు కూడా వ్యతిరేకమన్న శర్మ

Mar 21, 2024 - 18:46
 0
హస్తంలో చిచ్చురేపుతున్న కులగణన

నా తెలంగాణ, ఢిల్లీ: కులగణన దివ్యౌషధం కాదని, దీని ద్వారా సమస్యలను పరిష్కరించలేమని కాంగ్రెస్​ వర్కింగ్​ కమిటీ సభ్యుడు, సీనియర్​నాయకుడు ఆనంద్ శర్మ స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ ప్రకటనకు కౌంటర్ భావిస్తున్న ఈయన వ్యాఖ్యలు ఆ పార్టీలో హాట్ టాపిక్ గా మారాయి. కులగణనతో నిరుద్యోగాన్ని రూపుమాపలేమని, అభివృద్ధిని చేపట్టలేమని ఆనంద్ శర్మ చేసిన వ్యాఖ్యలతో కులగణన అంశం కాంగ్రెస్​లో చిచ్చురేపినట్లయింది.  కులగణన అంశాన్ని ప్రస్తావిస్తూ ఖర్గేకు శర్మ లేఖ రాశారు. ఇంతకుముందు కూడా కులగణన చేపట్టాలనే అంశంపై పార్టీలో అంతర్గతంగా చర్చలు కొనసాగుతుంటే ఆనంద్​ శర్మ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆయన ఇదే అంశంపై లేఖ రాసిన తరువాత మీడియాతో మాట్లాడారు. ఇందిరాగాంధీ, రాజీవ్​ గాంధీలు కూడా కులగణనను వ్యతిరేకించారని పేర్కొన్నారు. కులాల విషయంలో ఇందిరాగాంధీ చేసిన నినాదాలను ఆయన గుర్తు చేశారు. 1990లో రాజీవ్​ గాంధీ చేసిన ప్రకటనను కూడా లేఖలో తెలిపానన్నారు. కులతత్వంతో ఇబ్బందులు తప్పవని ఇరువురు నేతలు పేర్కొనడాన్ని ఆనంద్​ శర్మ ఉదహరించారు.