ఫ్యాక్ట్ చెక్‌పై బాంబే హైకోర్టు ఆదేశాలు కొట్టివేసిన సుప్రీంకోర్టు
కేంద్ర ప్రభుత్వంపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న నకిలీ, తప్పుడు వార్తలను గుర్తించేందుకు సవరించిన ఐటీ నిబంధనల ప్రకారం ఫాక్ట్ చెక్ యూనిట్‌ను ఏర్పాటు చేయకుండా బాంబే హైకోర్టు మార్చి 11న ఇచ్చిన ఆదేశాలను సుప్రీం కోర్టు న్యాయమూర్తి సీజేఐ చంద్రచూడ్ ధర్మాసనం కొట్టివేసింది.
నా తెలంగాణ, ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న నకిలీ, తప్పుడు వార్తలను గుర్తించేందుకు సవరించిన ఐటీ నిబంధనల ప్రకారం ఫాక్ట్ చెక్ యూనిట్‌ను ఏర్పాటు చేయకుండా బాంబే హైకోర్టు మార్చి 11న ఇచ్చిన ఆదేశాలను సుప్రీం కోర్టు న్యాయమూర్తి సీజేఐ చంద్రచూడ్ ధర్మాసనం కొట్టివేసింది. గురువారం ఈ కేసుపై విచారణ చేపట్టింది. కేంద్ర ప్రభుత్వంపై తప్పుడు వార్తలను గుర్తించేందుకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) విభాగాన్ని ఏర్పాటు చేస్తూ కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్‌పై సుప్రీం స్టే విధించింది. ఇది భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించిన అంశమని కోర్టు పేర్కొంది. ఫాక్ట్ చెక్ యూనిట్‌ను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్, 2021 ప్రకారం మార్చి 20న కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ నోటిఫై చేసింది.