న్యూయార్క్ కోర్టు జడ్జిగా భారతీయుడు!

అమెరికాలోని న్యూయార్క్‌లో గల తూర్పు జిల్లా కోర్టుకు భారత సంతతికి చెందిన సంకేత్‌ జయసుఖ్‌ బల్సరా న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

Feb 10, 2024 - 16:10
 0
న్యూయార్క్ కోర్టు జడ్జిగా భారతీయుడు!

న్యూయార్క్‌​​: అమెరికాలోని న్యూయార్క్‌లో గల తూర్పు జిల్లా కోర్టుకు భారత సంతతికి చెందిన సంకేత్‌ జయసుఖ్‌ బల్సరా న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ న్యూయార్క్‌లోని తూర్పు జిల్లా కోర్టుకు భారత సంతతి న్యాయమూర్తిని నామినేట్ చేశారు. న్యూయార్క్‌లోని డిస్ట్రిక్ట్ కోర్టులో పనిచేస్తున్న బల్సరా.. సెక్యూరిటీలు, కాంట్రాక్టులు, దివాలా,  నియంత్రణ విషయాలలో తన నైపుణ్యాన్ని నిరూపించుకున్నారు. ఆయన తల్లిదండ్రులు భారతదేశం నుంచి అక్కడికి వలస వెళ్లారు. యూఎస్‌ కోర్టుకు నియమితులైన మొట్టమొదటి దక్షిణాసియా అమెరికన్ ఫెడరల్ న్యాయమూర్తిగా బల్సరా ఘనత సాధించారు.