ప్రధాని మోదీ కృషితో తెలంగాణలో రైల్వే స్టేషన్ల అభివృద్ధి

తెలంగాణలో రైల్వే స్టేషన్ల ఆధునీకరణకు, అభివృద్ధికి ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని కేంద్ర మంత్రి జి. కిషన్​ రెడ్డి తెలిపారు.

Feb 10, 2024 - 16:02
 0
ప్రధాని మోదీ కృషితో తెలంగాణలో రైల్వే స్టేషన్ల అభివృద్ధి

నా తెలంగాణ, న్యూఢిల్లీ: తెలంగాణలో రైల్వే స్టేషన్ల ఆధునీకరణకు, అభివృద్ధికి ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని కేంద్ర మంత్రి జి. కిషన్​ రెడ్డి తెలిపారు. ‘అమృత్​ భారత్​ స్టేషన్స్​’ పథకం మొదటి దశలో భాగంగా దాదాపు రూ.894 కోట్లతో తెలంగాణలో 21 రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి జరుగుతోందని వెల్లడించారు. భారత ప్రభుత్వం రూ.309 కోట్ల వ్యయంతో నాంపల్లి  రైల్వేస్టేషన్‌ అత్యాధునికంగా మారబోతున్నదని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు నాంపల్లి స్టేషన్​ ఆధునీకరణ పనులు పూర్తయితే.. ఎలా ఉంటుందో చూపే వీడియోను శనివారం ఆయన ట్విటర్​ లో షేర్​ చేశారు.