ఎక్కడ రాముడుంటాడో.. అక్కడ ధర్మం ఉంటుంది
అయోధ్యలో నిర్మించిన రామ మందిరం గురించి శనివారం లోక్సభలో స్వల్ప కాలిక చర్చ చేపట్టారు.
న్యూఢిల్లీ: అయోధ్యలో నిర్మించిన రామ మందిరం గురించి శనివారం లోక్సభలో స్వల్ప కాలిక చర్చ చేపట్టారు. బీజేపీ ఎంపీ సత్యపాల్ సింగ్ చర్చను ప్రారంభించారు. డీఎంకే నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నప్పటికీ.. రాముడి అంశంపై చర్చ కొనసాగింది. రామకథను చర్చించడం వల్ల పార్లమెంటరీ నేతలకు పుణ్యం వస్తుందని ఎంపీ సత్యపాల్ అన్నారు. జనవరి 22వ తేదీన జరిగిన ప్రాణ ప్రతిష్ట గురించి మాట్లాడుతూ ఆ కార్యక్రమాన్ని వీక్షించడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. అయోధ్యలోని రామజన్మభూమిలో రాముడికి పూజలు చేయడం చరిత్రాత్మకమన్నారు. రాముడు ఎక్కడ ఉంటే అక్కడ ధర్మం ఉంటుందని, ధర్మాన్ని నాశనం చేసినవాళ్లకు మరణం తప్పదని, ధర్మాన్ని కాపాడిన వాళ్లకు రక్షణ ఉంటుందన్నారు.