మోదీ మాటలు జీర్ణించుకోలేకనే రాహుల్​ అసంబద్ధ వ్యాఖ్యలు

ప్రధాని మోదీ పార్లమెంట్ ఉభయ సభల్లో కాంగ్రెస్ బడుగు, బలహీన వర్గాలకు వ్యతిరేకం అనే విషయాన్ని తెలిపారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తెలిపారు.

Feb 9, 2024 - 16:44
 0
మోదీ మాటలు జీర్ణించుకోలేకనే  రాహుల్​ అసంబద్ధ వ్యాఖ్యలు

నా తెలంగాణ, ఢిల్లీ: ప్రధాని మోదీ పార్లమెంట్ ఉభయ సభల్లో కాంగ్రెస్ బడుగు, బలహీన వర్గాలకు వ్యతిరేకం అనే విషయాన్ని తెలిపారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తెలిపారు. రిజర్వేషన్లను నెహ్రూ అడ్డుకున్న విషయాన్ని బట్టబయలు చేశారన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎస్టీ, ఎస్సీ, బీసీ రిజర్వేషన్లను నెహ్రూ వ్యతిరేకించారన్నారు. దీన్ని కాంగ్రెస్ జీర్ణించుకోలేక పోయిందని.. అందుకే మోదీ కులంపై ఇపుడు మాట్లాడుతున్నారని లక్ష్మణ్ దుయ్యబట్టారు. మోదీ కులంపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తప్పుడు, అసంబద్ధ వాఖ్యలు చేస్తున్నారన్నారు. మోదీ ముఖ్యమంత్రి అయ్యాక ఓబీసీలో ఆయన కులం చేరిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారని లక్ష్మణ్ అన్నారు. మోదీతో పాటు ఓబీసీ సమాజానికి రాహుల్ క్షమాపణ చెప్పాలన్నారు. బీజేపీ కుల గణను ఎక్కడా అడ్డుకోలేదని.. అడ్డుపడలేదని లక్ష్మణ్ వివరించారు.