జార్జియా గ్యాస్​ లీక్​ లో 11మంది భారతీయులు మృతి

11 Indians killed in Georgia gas leak

Dec 17, 2024 - 16:19
 0
జార్జియా గ్యాస్​ లీక్​ లో 11మంది భారతీయులు మృతి

టిబిలిసి: జార్జియా టిక్లీష్​ ఇండియన్​ అరబిక్​ రెస్టారెంట్​ లో గ్యాస్​ లీకై 11మంది భారతీయులు సహా మరో వ్యక్తి మృతిచెందాడు. పోలీసు విచారణలో వీరి మృతికి గ్యాస్​ లీక్​ కారణమని తేలింది. రాత్రి పడుకునేముందు అన్ని తలుపులు మూసుకోవడం, మధ్యరాత్రి గ్యాస్ లీక్​ కావడంతో వీరు మృతిచెందారని ప్రకటించారు. మృతిచెందిన వారి శరీరాలపై ఎలాంటి గాయాలు లేవన్నారు. మృతదేహాలన్నీ స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి భద్రపరిచామన్నారు. అయితే గ్యాస్​ లీక్​ ఘటనకు సంబంధించి ఇంకా దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వివరించారు. మరో వ్యక్తి జార్జియన్​ పౌరుడని పోలీసులు తెలిపారు. కాగా మృతుల్లో పంజాబ్​ లూథియానాకు చెందిన సమీర్​ అనే వ్యక్తి ఉన్నాడు. ఇతను ఆరు నెలలక్రితమే జార్జియాకు వెళ్లాడు. భారత దౌత్యకార్యాలయం తమకు సహాయం చేయాలని సమీర్​ మృతదేహాన్ని స్వదేశానికి తెప్పించాలని కుటుంబసభ్యులు వేడుకుంటున్నారు.