క్రషర్ మిల్లును తొలగించాలని రాస్తారోకో

roadblocks to remove crusher mill

Jun 11, 2024 - 14:51
 0
క్రషర్ మిల్లును తొలగించాలని రాస్తారోకో

నా తెలంగాణ, డోర్నకల్: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం గూడూరు ప్రధాన రహదారిపై అర్పణ పల్లి గ్రామస్థులు మంగళవారం ఉదయం రాస్తారోకో చేపట్టారు. కేసముద్రం మండలంలోని అర్పణపల్లి గ్రామ సమీపంలోని క్రషర్ మిల్లులో పేలుళ్లు బాగా జరుగుతున్నాయని దానివల్ల ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు తెలిపారు. వెంటనే అధికారులు స్పందించి మిల్లును మూసివేయాలని దాని అనుమతులను రద్దు చేయాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు. పేలుళ్ల వల్ల నిద్దుర కూడా పోలేకపోతున్నామని వాపోయారు.