మహబూబాబాద్ మున్సిపల్ కమిషనర్ పై చర్యలకు డిమాండ్​

బీఆర్​ఎస్​ నాయకుడి అక్రమ నిర్మాణానికి సహకారం? ప్రజావాణిలో బాధితుడి ఫిర్యాదు

Jun 11, 2024 - 14:55
 0
మహబూబాబాద్ మున్సిపల్ కమిషనర్ పై చర్యలకు డిమాండ్​

నా తెలంగాణ, డోర్నకల్: మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధికి చెందిన బీఆర్​ఎస్​ నాయకుడు తన ఇంటి స్థలంలో మున్సిపల్ కమిషనర్ మద్దతుతో అక్రమంగా ఇంటిని నిర్మిస్తున్నాడు అని అంజద్ ఖాన్ తెలిపారు. మున్సిపల్ కమిషనర్ అక్రమాలపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని మంగళవారం అంజద్ ఖాన్ హైదరాబాద్ ప్రజాభవన్ లో ఫిర్యాదు చేశారు. ఎన్నిసార్లు వారించినా వినిపించుకోవడం లేదని అంజద్​ ఖాన్​ వాపోయారు.