ప్రభుత్వ ఏర్పాటు.. గవర్నర్ ను కలిసి చంద్రబాబు
ఎన్డీయే పక్ష నేతగా ఎన్నిక అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ గా పవన్ కళ్యాణ్ శాసనసభా పక్ష భేటీలో నిర్ణయం సీఎం ప్రమాణ స్వీకారానికి ప్రధాని హజరు
విజయవాడ: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజయవాడలోని రాజ్ భవన్ కు చేరుకొని గవర్నర్ అబ్జుల్ నజీర్ ను కలిసి ప్రభుత్వ ఏర్పాటు ప్రతిపాదనలు సమర్పించారు. మంగళవారం ఉదయం చంద్రబాబుతోపాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పలువురు ప్రజాప్రతినిధులు గవర్నర్ ను కలిసి వారిలో ఉన్నారు. బుధవారం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. చంద్రబాబునాయుడు గన్నవరం కేసరపల్లి ఐటీ పార్క్ లో జూన్ 12 (బుధవారం) 11.27 నిమిషాలకు సీఎంగా పదవీ ప్రమాణ స్వీకారం చేపట్టనున్నారు. కాగా ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా హాజరు కానుండడంతో మూడువేల మంది భద్రతా సిబ్బందితో భారీ బందోబస్తు చేపట్టారు.
ప్రమాణ స్వీకారానికి 11 ఎకరాల విశాల స్థలంలో ఏర్పాట్లు చకచకా పూర్తి చేస్తున్నారు. విజయవాడలో మంగళవారం ఉదయం టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేల భేటీలో ఎన్డీయే శాసనసభా పక్ష నేతగా చంద్రబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ గా ఎన్నికయ్యారు.
అనంతరం గవర్నర్ ను కలిశారు. సాయంత్రంలోగా ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు.