నా తెలంగాణ, ఆదిలాబాద్: పంట నష్టపోయిన రైతులకు అన్ని విధాల ఆదుకుంటామని మంత్రి శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. మంత్రి శ్రీధర్ బాబు మంగళవారం పెన్ గంగా ప్రాంతంలో పర్యటించారు.ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పెనుగంగ శ్రీరాంసాగర్ ప్రాజెక్టు, స్వర్ణ ప్రాజెక్టు, కడెం (నిర్మల్) ప్రాజెక్టులు నిండుకుండల్లా మారి పొంగిపోర్లుతున్నాయి. పంట, ఆస్తి నష్టం వివరాలను వెంటనే సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ముందు బాధితులు, రైతాంగం ఎలాంటి ఆందోళన చెందవద్దని నష్టపోయిన వారిని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. వర్షాలు, వరదలపై అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు వాతావరణ శాఖతో సమన్వయం చేసుకొని పటిష్ఠ చర్యలు చేపట్టాలని శ్రీధర్ బాబు అన్నారు.