అభివృద్ధికి కొత్త దిశ
రాజస్థాన్ లో ప్రధాని నరేంద్ర మోదీ
రూ. 46,300 కోట్లతో 24 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
బలమైన పునాదితోనే శరవేగంగా
నీటి ప్రాజెక్టులకూ కాంగ్రెస్ అడ్డంకులు
మూడోసారి ఆశీర్వదించిన ప్రజలకు కృతజ్ఞతలు
జైపూర్: రాజస్థాన్ అభివృద్ధికి కొత్త దిశను చూపించడంలో భజ్ లాల్ శర్మ చాలా కష్టపడి పనిచేశారని, బీజేపీ డబుల్ ఇంజన్ ప్రభుత్వం సుపరిపాలనకు చిహ్నమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రాజస్థాన్ ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన 'ఏక్ వర్ష్- పరిమాన్ ఉత్కర్ష్' కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా రూ.46,300 కోట్ల విలువైన 24 ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.
సుపరిపాలనకు గ్యారంటీ..
ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ.. తనను ఆశీర్వదించేందుకు వచ్చిన లక్షలాదిమందికి కృతజ్ఞతలు తెలిపారు. తొలి యేడాది రాజస్థాన్ అభివృద్ధికి బలమైన పునాది వేశామన్నారు. ఈ ఉత్సవాలు ఒక్క యేడాదికే పరిమితం కావాలన్నారు. రాజస్థాన్ కాంతిని విశ్వవ్యాప్తి చేస్తాను. రాజస్థాన్‌లో నీటి సమస్య శాశ్వతంగా పరిష్కారం లభించను. ప్రారంభించిన ప్రాజెక్టులతో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. రాజస్థాన్ పర్యాటకం, రైతులు, యువత, మహిళలు, వ్యాపారులు పొందుతారని తెలిపారు. సుపరిపాలనకు బీజేపీది గ్యారంటీ అన్నారు. వరుసగా దేశ ప్రజలు మూడోసారి తమను ఆశీర్వదించారని అన్నారు.
నిరుపేదలకు మేలు..
హరియాణాలోనూ మూడోసారి మెజార్టీ విజయం సాధించామన్నారు. బైరవ్ సింగ్ షెకావత్, వసుంధర రాజే, భజన్ లాల్ ప్రభుత్వం సుపరిపాలన దిశగా పయనింపజేస్తున్నారు. పేద కుటుంబాలు, తల్లులు, కుమార్తెలు, సంచార కుటుంబాల కోసం అనేక నిర్ణయాలు తీసుకున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజస్థాన్ కు తీవ్ర ద్రోహమే చేసింది. యువతకు ఉద్యోగాలు, ఉపాధి కూడా లభించలేదు.
వివాదాలను తిప్పికొట్టాం.. నీటిని తీసుకొచ్చాం..
కాంగ్రెస్ హయాంలో రాజస్థాన్ రిక్రూట్ మెంట్ లో పేపర్ లీకులపై బీజేపీ విచారణ చేపట్టి అనేకమందిని అరెస్టు చేశామన్నారు. రాజస్థాన్ కు బీజేపీ ఇచ్చిన హామీలన్నీ నెరవేరుతాయి. రైతులకు ఎంఎస్ పీ కల్పిస్తున్నామన్నారు. నీటికొరతను తీర్చేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. కాంగ్రెస్ హయాంలో ఏనాడూ రాజస్థాన్‌లో నీటి కొరత తీర్చేందుకు పనిచేయలేదన్నారు. ఇక్కడి నదుల నీరు వృథాగా సముద్రంలో కలిసేదన్నారు. దీనితో రాష్ట్ర్టానికి రైతాంగానికి, ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కావాలనే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మధ్య నీటివివాదాలను సృష్టించేదన్నారు. గుజరాత్ లోని సర్దార్ సరోవర్ డ్యామ్ పనులను అడ్డుకునేందుకు అనేక వ్యూహాలను అమలు చేసిన ఘనత ఆ పార్టీదన్నారు. వీరి విమర్శలను తిప్పికొడుతూ నర్మదా నీటిని రాజస్థాన్ కు చేర్చామన్నారు. బీజేపీ విధానం సమస్యలను పరిష్కరించడమే తప్ప మరింత పెంచి విద్వేషాలు సృష్టించేది కాదన్నారు. రాజస్థాన్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన పావర్తి, చంబల్, కలిసింద్ ప్రాజెక్టు, ఎంపీ కేపీ లింక్ ప్రాజెక్టుపై ఒప్పందం కుదిరిందని తెలిపారు. ఈ నదుల అనుసంధానం వల్ల 21 జిల్లాల సాగు, తాగునీరు అందాలకు. వందశాతం కుళాయి నీరు చేరాయి.