యుద్ధం ఆపాలి పుతిన్, జెలెన్స్కీలతో మాట్లాడతా
డోనాల్డ్ ట్రంప్
వాషింగ్టన్: రష్యా–ఉక్రెయిన్ ల మధ్య యుద్ధాన్ని ఆపాలని నూతనంగా డోనాల్డ్ ట్రంప్ విజ్ఞప్తి చేశారు. ఇరుదేశాలు రాజీపడితేనే యుద్ధం సమసిపోతుందన్నారు. యుద్ధం ఆపేందుకు తమ సహాయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ట్రంప్ తెలిపారు. పుతిన్, జెలెన్స్కీలతో మాట్లాడతానన్నారు. ఉక్రెయిన్ కోలుకోవాలంటే వందేలకు పైగా పడుతుందని ట్రంప్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఒక్క భవనం కూడా మిగలని నగరాలు ఎన్నో ఉన్నాయని, అన్ని నాశనమైపోయాయన్నారు. యుద్ధం ఏ దేశానికి మంచిది కాదన్నారు. సంఘర్షణలు, యుద్ధాలు ప్రపంచ వినాశనానికి కారణాలుగా మిగిలిపోతాయన్నారు.