కశ్మీర్​ లోయలో ప్రధాని పర్యటన

370 రద్దు తరువాత ఇదే తొలి పర్యటన పెరిగిన ఆదరణ, మెజార్టీ కోసం కమలదళం వ్యూహం

Feb 27, 2024 - 19:31
 0
కశ్మీర్​ లోయలో ప్రధాని పర్యటన

కశ్మీర్​: కశ్మీర్​ లోయలో తొలిసారిగా ప్రధాని మోదీ పర్యటనను వచ్చె నెలలో (మార్చి) నిర్వహించనున్నట్లు బీజేపీ వర్గాలు మంగళవారం స్పష్టం చేశాయి. ఆర్టికల్​ 370 రద్దు తరువాత లోయలో ప్రధాని పర్యటన ఇదే తొలిసారని ఆ వర్గాలు పేర్కొన్నాయి. రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రధాని పర్యటన షెడ్యూల్​ ఖరారు చేయడమే తరువాయిగా పేర్కొన్నాయి. ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీ జమ్మూకశ్మీర్​ లో రూ. 32వేల కోట్లతో అభివృద్ధి పనులను ప్రారంభించిన విషయం తెలిసిందే. దీంతో అక్కడి స్థానిక ప్రజల్లో బీజేపీ పార్టీ, ప్రధాని నరేంద్ర మోదీపై విశేష ఆదరణ నెలకొన్నట్లు పలు సోషల్​ మీడియా మాధ్యమాల ద్వారా వెల్లడవుతోంది. ఇదే సమయంలో ప్రధాని పర్యటిస్తే జమ్మూకశ్మీర్​ ఫలితాల్లో స్పష్టమైన మెజార్టీ దిశగా కమలం దూసుకుపోవచ్చిన పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. 
పర్యటన..
మార్చి 14 లేదా 17న పర్యటన ఉండే అవకాశం ఉంది. దక్షిణ కశ్మీర్​ లోని షోపియాన్​, కుల్గాం, అనంత్​ నాగ్​, జమ్మూలోని రాజౌరీ, పూంచ్​ తదితర ప్రాంతాల్లో పర్యటించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.