కీలకంగా తీర్చిదిద్దడంలో సేవలు అభినందనీయం
ఉత్తమ ఉపాధ్యాయులతో ప్రధాని నరేంద్ర మోదీ
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: భారత సంస్కృతి, సాంప్రదాయాలతోపాటు విద్యార్థులకు కళలు, సాహిత్యం తదితరాలను బోధించడం, చరిత్ర కలిగిన స్థలాలపై బోధనలు ఉపాధ్యాయులు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు.
రాష్ర్టపతి చేత ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులను అందుకున్న ఉపాధ్యాయులతో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం సాయంత్రం న్యూఢిల్లీలోని తన నివాసంలో భేటీ అయ్యారు. పలు అంశాలపై చర్చించారు.
విద్యార్థులకు ఉత్తమ ఉపాధ్యాయుల బోధనను అభినందించారు. విశేష సేవలందించడం సంతోషకరమన్నారు.
విద్యతోపాటు విద్యార్థులకు కళలు, భాషలు, ప్రాంతాలు, దేశ చరిత్ర, మహానీయుల విధానాలపై వివరించే చర్యలను తీసుకోవాలని సూచించారు. విద్యావ్యవస్థ పటిష్ఠంగా ఉంటేనే దేశ యువతకు దేశంపై ప్రేమ మరింత పెరుగుతుందన్నారు.
ఎప్పుడు బోధనలతోనే గాకుండా విద్యా పర్యటనలపై కూడా ప్రాధాన్యతను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. పర్యాటక ప్రాంతాల్లో పర్యటిస్తూనే విద్యార్థుల అభ్యాసాన్ని బోధించవచ్చన్నారు. దీంతో పర్యాటక రంగానికి కూడా మరింత ఊతం లభిస్తుందని ప్రధాని మోదీ వివరించారు.
అవార్డులు లభించిన ఉపాధ్యాయులు సోషల్ మీడియాలో ఎప్పుడూ ఒకరితో మరొకరు చర్చించుకోని తాను చెప్పిన వినూత్న విద్య, అభ్యాసాలను చర్చించుకొని ఎప్పటికప్పుడు నూతన అభ్యసనలను విద్యార్థులకు వివరించాలని తెలిపారు.
దీంతో విద్యార్థులకు కూడా నూతన బోధనా విధానం ద్వారా ఆసక్తి పెంపొందుతుందన్నారు. ఆసక్తిగల పద్ధతుల ద్వారా బోధించడం వల్ల టీచింగ్ సామర్థ్యాలను పెంచుకోవాలని, విద్యార్థుల్లో పట్టుదల, ధైర్యం, అంకితభావం, నూతన విషయాలపై ఆసక్తి తదితరాలను పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులకు ప్రధాని నరేంద్ర మోదీ కోరారు.