తేజస్వీ ఎస్కార్ట్​ వాహనం ఢీకొని ఒకరు మృతి ఆరుగురికి తీవ్ర గాయాలు

తేజస్వీ యాదవ్​ (ఆర్​ జేడీ) నేత ఎస్కార్ట్​ వాహనం ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని ఢీకొనడంతో 50 యేళ్ల హోంగార్డు మృతిచెందాడు.

Feb 27, 2024 - 19:29
 0
తేజస్వీ ఎస్కార్ట్​ వాహనం ఢీకొని ఒకరు మృతి ఆరుగురికి తీవ్ర గాయాలు

పాట్నా: తేజస్వీ యాదవ్​ (ఆర్​ జేడీ) నేత ఎస్కార్ట్​ వాహనం ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని ఢీకొనడంతో 50 యేళ్ల హోంగార్డు మృతిచెందాడు. మంగళవారం పూర్ణియా జిల్లాలో తేజస్వి యాదవ్​ కు ఈ వాహనం ఎస్కార్ట్​ గా వెళుతోంది. ఎస్పీ ఉపేంద్ర నాథ్​ వివరాలను వెల్లడించారు. ఈ ప్రమాదం సోమవారం అర్థరాత్రి చోటు చేసుకుందన్నారు. అదే వాహనంలో ఉన్న మరో ఆరుగురు మిలటరీ సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయని వారిని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి చికిత్స కోసం తరలించామన్నారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని ఎస్పీ తెలిపారు. జన్ విశ్వాస్ యాత్రలో తేజస్వీ పర్యటనలో ఉండగా ఈ ప్రమాదం జరిగిందని ఎస్పీ ఉపేంద్రనాథ్​ వివరించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.