అనాథ మహిళకు అంత్యక్రియలు

మానవత్వం చాటుకున్న నిర్మల హృదయ సేవా సమితి 

Sep 16, 2024 - 18:40
 0
అనాథ మహిళకు అంత్యక్రియలు

నా తెలంగాణ, నిర్మల్: రక్త బంధాలను సైతం మరచిపోతున్న నేటి సమాజంలో ఇంకా మానవత్వం మిగిలి ఉందని చాటుకున్నారు నిర్మల్ కు చెందిన నిర్మల హృదయ సేవా సమితి సభ్యులు. పట్టణానికి  చెందిన మగ్గిడి లక్ష్మి (70) సోమవారం ఉదయం స్థానిక శాంతి నగర్ లో గుండె పోటుతో మరణించింది. సమాచారం అందుకున్న సమితి సభ్యులు అక్కడికి చేరుకున్నారు. శవానికి సంబంధించి అంతిమయాత్ర, శవ దహన కార్యక్రమాలు మధ్యాహ్నం వరకు పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సాదం ఆనంద్, తెలంగాణ బీసీ మహా సభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాటకారి సాయన్న, బి వెంకటేశ్వరరావు, ఎం ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.