108లో ప్రసవం.. తల్లీ బిడ్డ క్షేమం
Childbirth in 108. Mother and child are healthy
నా తెలంగాణ, సిర్పూర్: 108లో ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రసవం జరిగింది. సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో తల్లిబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు.
కొమురం బీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యు) మండలంలోని జాముల్దార గ్రామానికి చెందిన కినక పార్వతి గర్భిణి మహిళకు పురిటి నొప్పులు వచ్చాయి. 108 అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రసవించి మగబిడ్డకు జన్మనిచ్చింది. 108 సిబ్బంది రామేశ్వరికి గర్భిణి కుటుంబ సభ్యులు, బంధువులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రసవం అనంతరం మెరుగైన వైద్యం కోసం తల్లిబిడ్డను ఆసుపత్రికి తరలించారు.