శాంతి స్వరూప్ కన్నుమూత
తొలి తెలుగు న్యూస్ రీడర్‌గా చెరగని ముద్ర
నా తెలంగాణ, హైదరాబాద్: తొలిసారిగా తెలుగులో వార్తలు చదివిన శాంతిస్వరూపుడి కంఠం మూగబోయింది. తొలితరం టీవీలో న్యూస్ రీడర్శాంతి స్వరూప్ కన్నుమూశారు. రెండు రోజుల క్రితం గుండెపోటు రావడంతో ఆయన్ను కుటుంబ సభ్యులు యశోదా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతో శుక్రవారం శాంతిస్వరూప్ మృతిచెందారు. 1983 నవంబర్ 14న దూరదర్శన్‌లో వార్తలు చదవడం ప్రారంభించిన శాంతి స్వరూప్కేవలం పేపర్ చూసి వార్తలు చదివేవారు. తెలుగు ప్రజల్లో న్యూస్ రీడర్‌గా చెరగని ముద్ర వేశారు. 2011రిటైర్ అయ్యేంతవరకు ఆయన వార్తలు చదువుతూనే ఉన్నారు. యాంకరింగ్‌లో శాంతి స్వరూప్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును అందుకున్నారు.
గ్రాడ్యుయేషన్ చేసిన శాంతి స్వరూప్.. 1978లోనే దూరదర్శన్‌లో చేరి కెరీర్ ప్రారంభించారు. అయితే ఆయనకు వార్తలు చదివేందుకు అవకాశం మాత్రం 1983 నవంబర్ 14న వచ్చింది. టెలి ప్రాంప్టర్ లేకుండానే వార్తలు వినిపించేవారు.
శాంతి స్వరూప్ సతీమణి రోజా రాణి కూడా న్యూస్ రీడర్. 1980లో వీళ్ల వివాహం జరగ్గా.. వీళ్లకు ఇద్దరు సంతానం విదేశాల్లో స్థిరపడ్డారు. సాహిత్యంపై పట్టున్న శాంతి స్వరూప్.. భోపాల్ గ్యాస్ దుర్ఘటన మీద ‘‘రాతి మేఘం’ అనే నవల రాశారు. క్రికెట్ మీద మక్కువతో ‘క్రేజ్’, సతీ సహగమన దురాచారానికి వ్యతిరేకంగా ‘అర్ధాగ్ని’ అనే నవల రాశారాయన. యాంకరింగ్‌లో లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందుకున్నారు.
శాంతి స్వరూప్ మృతిపై పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. తొలి తరం న్యూస్ రీడర్ గా అందరికీ సుపరిచితులైన శాంతి స్వరూప్ గారి మృతి బాధాకరమన్నారు. సుదీర్ఘ కాలం పాటు దూరదర్శన్ ద్వారా ఆయన అందించిన సేవలు తెలుగు రాష్ట్రాల ప్రజలకు చిరస్మరణీయం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.