నిధుల కేటాయింపులో వెనుకబడ్డ తెలంగాణ

బీజేపీ పాలిత ప్రాంతాల్లో భారీ కేటాయింపులు

Aug 3, 2024 - 16:23
 0
నిధుల కేటాయింపులో వెనుకబడ్డ తెలంగాణ
నా తెలంగాణ, హైదరాబాద్​: ఓ వైపు దేశంలోని బీజేపీ పాలిత ప్రాంతాల్లో సామాజిక, మౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద పీట వేస్తున్నామని, అదే సమయంలో తెలంగాణలో కాంగ్రెస్​ నేతృత్వంలోని ప్రభుత్వం కేటాయింపులు అత్యంత తక్కువగా ఉన్నాయని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్​ రెడ్డి అన్నారు. కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి 2023–24లో కేటాయింపుల వివరాలకు సంబంధించిన లెక్కలను ఉదహరిస్తూ సామాజిక మాధ్యమం వేదికగా వివరాలను వెల్లడించారు. ఈ లెక్కల ప్రకారం కేటాయింపులు ఎలా ఉన్నాయో చూద్దాం.
 
విద్యాశాఖ: తెలంగాణ 7.60 శాతం నిధులు కేటాయించగా, యూపీ 13.10, ఉత్తరాఖండ్​ 16.60, మహారాష్ట్ర 16.60, అసోం 16.80, మధ్యప్రదేశ్​ 16.10, గుజరాత్​ 14.30 శాతం నిధులు కేటాయించారు.
 
పోలీసు శాఖ: తెలంగాణ 3.60 శాతం నిధులు కేటాయించగా, యూపీ 5.50, మహారాష్ట్ర 5.0, అసోం 5.80 శాతం నిధులు కేటాయించారు.
 
రోడ్లు, బ్రిడ్జిలు: తెలంగాణ 3.70 శాతం, ఉత్తరప్రదేశ్​ 5.90 శాతం, మహారాష్ర్ట 5.80 శాతం, అసోం 9.30 శాతం, గుజరాత్​ 6.30 శాతం నిధులు కేటాయించారు.
 
గ్రామీణాభివృద్ధి: తెలంగాణ 3.60 శాతం నిధులు కేటాయించగా, యూపీకి 5 శాతం, ఉత్తరాఖండ్​ 7.40 శాతం, మహారాష్ట్ర 4.70 శాతం, మధ్యప్రదేశ్​ 4.50 శాతం నిధులు కేటాయించారు. 
 
అర్బన్​ అభివృద్ధి: తెలంగాణ 2.80 శాతం, యూపీ 4.40, మహారాష్ట్ర 3.80, అసోం 3, గుజరాత్​ 6.60 శాతం నిధులు కేటాయించారు. 
 
నీటి సరఫరా, శానిటేషన్​: తెలంగాణ 1.60 శాతం, యూపీ 3.80 శాతం, ఉత్తరాఖండ్​ 1.90 శాతం, మహారాష్ట్ర 2, మధ్యప్రదేశ్​ 3.60, గుజరాత్​ 2.40 శాతం నిధులను కేటాయించారు.