6.5 యథాతథంగా రెపో రేటు

మోనిటరింగ్​ పాలసీ కమిటీలో నిర్ణయం వివరాలు వెల్లడించిన ఆర్బీఐ గవర్నర్​ శక్తికాంతదాస్​

Apr 5, 2024 - 15:39
 0
6.5 యథాతథంగా రెపో రేటు

న్యూఢిల్లీ: ద్రవ్య విధాన ధర (రెపో రేటు)ను 6.5 శాతంగానే కొనసాగిస్తామని ఆర్బీఐ గవర్నర్​ శక్తికాంతదాస్​ స్పష్టం చేశారు. ఏప్రిల్​ 3 నుంచి 5 వరకు జరిగిన మోనిటరింగ్​ పాలసీ కమిటీలో (ఎంపీసీ) ఆర్బీఐ వడ్డీరేట్లను మార్చకూడదని నిర్ణయించిందని శుక్రవారం కమిటీలోని నిర్ణయాలను న్యూఢిల్లీలో మీడియాకు వివరించారు. వడ్డీరేట్లను అలాగే ఉంచడం ఇది ఏడోసారి అని పేర్కొన్నారు. చివరగా రెపోరేటును 2023లో స్వల్పంగా 0.25 శాతం పెంచామని స్పష్టం చేశారు. అదే సమయంలో  ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడంతోపాటు ఆర్థిక వ్యవస్థ పటిష్టం కాలేదన్నారు. రెపో రేటు మినహా, ఎస్డీఎఫ్ (స్టాండింగ్​ డిపాజిట్​ సౌకర్యం), ఎంఎస్​ఎఫ్​(మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ)లలో ఎటువంటి మార్పులు చేయలేదు. వీటిని యథాతథంగా 6.25 శాతం, 6.75 శాతంగా ఉంచాలని కమిటీ నిర్ణయించినట్లు తెలిపారు. 2023–-24 ఆర్థిక సంవత్సరంలో వాస్తవ జీడీపీ వృద్ధి 7.6 శాతంగా అంచనా వేస్తున్నట్లు తెలిపారు. జీడీపీ బలంగా ఉండేందుకు తయారీ, సేవా రంగాలు కీలకంగా ఉన్నాయన్నారు. అదే సమయంలో, వాస్తవ జీడీపీ వృద్ధి 7 శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. అంతకుముందు ఇది 6.9 శాతంగా ఉందని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లోనూ వినియోగం బలంగా ఉందని గవర్నర్ చెప్పారు. రబీ సీజన్‌లో ఉత్పత్తి కారణంగా ద్రవ్యోల్బణం తగ్గే అవకాశం ఉందన్నారు.  గ్లోబల్ సవాళ్లు, సాధారణ ఉష్ణోగ్రతల కంటే ఎక్కువ ఉన్నందున, ఖచ్చితంగా కొన్ని సవాళ్లు ఎదుర్కొనక తప్పనిసరి పరిస్థితులు ఉత్పన్నం అయ్యే అవకాశం ఉందన్నారు.