రూ. 6315.23 కోట్లతో ఐదు ఏయిమ్స్​ ఏర్పాటు

వర్చువల్ గా ప్రారంభించిన మోదీ

Feb 25, 2024 - 21:56
 0
రూ. 6315.23 కోట్లతో ఐదు ఏయిమ్స్​ ఏర్పాటు

గాంధీనగర్​: దేశంలో నిరుపేదలకు నాణ్యమైన వైద్యం అందించాలనే లక్ష్యంతో ప్రధాని నరేంద్రమోదీ భారీ ఎత్తున ఆరోగ్య చికిత్సలపై దేశవ్యాప్తంగా కార్యకలాపాలు విస్తృతం చేశారు. ఇందులో భాగంగానే రాజ్‌కోట్, భటిండా, రాయ్‌బరేలి, కళ్యాణ్, మంగళగిరిలో ఐదు ఎయిమ్స్(ఆల్ ఇండియా ఇన్ట్సిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) లను ప్రారంభించారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం రూ. 6315.23 కోట్లు ఖర్చు చేసింది. కేవలం మంగళగిరి ఏయిమ్స్​ కోసమే రూ.1618.23 కోట్ల వ్యయంతో 960 పడకల ఆసుపత్రి సముదాయాన్ని నిర్మించారు.