ఊరేగింపుపై రాళ్లదాడులు

పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టిన బీజేపీ, హిందూ సంఘాలు నిందితులకు కొమ్ముకాస్తున్న టీఎంసీ, పోలీసులు బాంబ్లస్ట్​ పై ఎన్​ఐఎ చేత విచారణ జరిపించాలని గవర్నర్​ కు బీజేపీ లేఖ

Apr 18, 2024 - 14:20
 0
ఊరేగింపుపై రాళ్లదాడులు

కోల్​ కతా: రామనవమి ఊరేగింపుపై దాడిని ఖండిస్తూ గురువారం బీజేపీ, ఆర్​ఎస్​ఎస్​, హిందు వర్గాలు ఆందోళన చేపట్టాయి. దాడి టీఎంసీ నేతలు, అనుచరులే చేశారని ఆరోపించారు. దీనిపై సమగ్ర విచారణకు ఎన్​ ఐఏను రంగంలోకి దింపాల్సిన అవసరం ఉందని గవర్నర్​ కు లేఖ రాశారు. బుధవారం రామనవమి ఊరేగింపు సందర్భంగా పశ్చిమ బెంగాల్​ లోని ముర్షిదాబాద్​ లో కొందరు దుండగులు భవనం నుంచి పెద్ద పెద్ద బండరాళ్లను రువ్వారు. దీంతో ఊరేగింపులో తీవ్ర కలకలం రేగింది. 20 మంది వరకు గాయపడ్డారు. శక్తి ప్రాంతంలో స్వల్ప పేలుడు చోటు చేసుకోవడంతో ఒక మహిళకు గాయాలయ్యాయి. ఈ రెండు ఘటనలపై బీజేపీ ఆర్​ఎస్​ ఎస్​ లు ఆందోళనకు దిగాయి. పోలీసులతో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. 

నిందితులపై ఎఫ్​ఐఆర్​ నమోదు చేసి వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్​ చేశారు.కాగా స్థానిక పోలీసులు ఎఫ్​ ఐఆర్​ ఇంకా నమోదు చేయకపోవడం గమనార్హం.

ముర్షిదాబాద్​, శక్తిపూర్​ లో 144 సెక్షన్​ విధించారు. బాంబుపేలుడా లేదా ఏదైనా ఇతర పేలుడా అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మరోవైపు రెజీనగర్​ ప్రాంతంలో కూడా రామనవమి ఊరేగింపుపై రాళ్లదాడులు జరిగాయి. ఈ దాడులపై గవర్నర్​ జోక్యం చేసుకొని ఎన్​ఐఏ చేత దర్యాప్తు జరిపించాలన్నారు. దాడులపై రాష్ర్ట పోలీసులు స్పందించడం లేదని మండిపడ్డారు. 

దాడులు వీరి నీచ సంస్కృతికి నిదర్శనమన్న సువేందు..

దాడులన్నింటిపై బీజేపీ నేత సువేందు అధికారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందు దేశంలో హిందూ పండుగలపై దాడులు చేయడం వీరి నీచ సంస్కృతికి నిదర్శనమన్నారు. ఇలాంటి వారినిదేశం నుంచితరిమి కొట్టాల్సిన అవసరం ఉందని మండిపడ్డారు. పోలీసులు కూడా టీఎంసీ ప్రభుత్వానికే వత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు. దాడులు చేసే వీడియోల్లో స్పష్టంగా నిందితులు కనిపిస్తుండడాన్ని చూసి కూడా దర్యాప్తు చేయని, కేసు నమోదు చేయని పశ్చిమ బెంగాల్​ పోలీసులు చేతగాని వారని ఎద్దేవా చేశారు. పోలీసులు నిందితులకు వత్తాసు పలుకుతూ తమపైనే టియర్​ గ్యాస్​ ప్రయోగానికి దిగడం ఏంటని మండిపడ్డారు. రామభక్తులకు రక్షణ కల్పించడంలో పోలీసులు, ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం మమత ప్రోద్భలం, ప్రేరేపణల ఫలితమే దాడులన్నారు. పోలీసులు ద్వంద్వ విధానాలపై ఈసీని కలిసి ఫిర్యాదు చేస్తామని చెప్పారు.